కథక్ డ్యాన్స్‌తో మెస్మరైజ్ చేస్తున్న యంగ్ హీరోయిన్.. ఆఫర్లు లేకనే ఇలా చేస్తున్నావా అంటూ కామెంట్స్

‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు.

Update: 2024-12-22 12:25 GMT

దిశ, సినిమా: ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. తన ఫస్ట్ మూవీతోనే ఈ భామ ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. అంతేకాకుండా కుర్రాళ్ల హార్ట్‌లో డ్రీమ్ గర్ల్‌గా చెరగని ముద్రవేసుకుంది. దీంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా వచ్చిన సినిమాలన్నింటిలో నటించింది. బట్ అంతగా హిట్ కాలేకపోయాయి. దీంతో టాలీవుడ్‌కి బై బై చెప్పేసి కోలీవుడ్‌కి చెక్కేసింది. ప్రస్తుతం అక్కడ ఒక సినిమాలో నటిస్తోంది. ఈ క్రమంలో ఈ అమ్మడుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో.. కృతి శెట్టి మనోహరమైన కథక్ డ్యాన్స్ బీట్స్‌తో అదరహో అనిపించింది. అంత అలవోకగా చిందులేస్తున్న ఆమె నృత్యాన్ని చూసి అందరూ మంత్రముగ్ధులు అవుతున్నారు. దీంతో ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు.. వావ్ బేబమ్మ నీలో ఈ యాంగిల్ కూడా ఉందా..? నీ డ్యాన్స్‌కి మేము ఫిదా అయ్యాము అని కొంత మంది అంటుంటే మరికొంత మంది మాత్రం ఆఫర్లు లేకనే ఇలా డ్యాన్స్‌లు చేస్తోందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఈ వీడియో పై ఓ లుక్ వేసేయండి.

Tags:    

Similar News