Keerthy Suresh:పెళ్లయి నెల రోజులు కాకుండానే భర్తకు దూరంగా కీర్తి సురేష్.. అసలేం జరిగిందంటే?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthy Suresh) వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది.
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్(Keerthy Suresh) వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. అయితే కెరీర్ పీక్స్‌లో ఉండగానే.. ఇటీవల తన ప్రియుడు ఆంటోనీ తటిల్(Antony Thattil)ను గోవాలో పెళ్లి చేసుకుంది. డిసెంబర్ 12న డెస్టినేషన్ వెడ్డింగ్(Destination Wedding) జరగ్గా.. ఆ తర్వాత క్రిస్టియన్ పద్ధతిలో మరోసారి పెళ్లి చేసుకుంది. ఇక కాళ్ల పారాణి ఇంకా అరనేలేదు. అలాగే సోషల్ మీడియా(Social Media)లో పెళ్లి ఫొటోలు, వీడియోలు నెట్టింట ట్రెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా, కీర్తి సురేష్ అందరికీ షాక్ ఇచ్చింది. తను నటిస్తున్న ‘బేబీ జాన్’ (Baby John)మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది.
ఇక పెళ్లై అయ్యాక కీర్తి హనీమూన్(Honeymoon)కు వెళతుందని అంతా భావించారు. కానీ నెల రోజులు కూడా కాకుండానే అలా చేయడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. బరువు బాధ్యతలు తీసుకుని ప్రచార హంగామా పైనే కీర్తి ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం తన కోస్టార్ వరుణ్ ధావన్(Varun Dhawan)తో కలిసి కీర్తి దుబాయ్ పర్యటన చేస్తోంది. ‘బేబీ జాన్’ కోసం పిక్స్ దిగుతూ నెట్టింట రచ్చ చేస్తోంది. కానీ మెడలో మంగళసూత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక భారతీయ మహిళ తాళిని గౌరవించడం అంటే భర్తను గౌరవించడమే అని అంతా అంటున్నారు. అలాగే నెల రోజుల కాకుండానే భర్తకు దూరంగా ఉంటూ ప్రమోషన్స్ చేయడం గ్రేట్ అని కామెంట్లు పెడుతున్నారు.