‘తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఘటనలు ఈ సినిమాలో ఉన్నాయి’.. దిల్ రాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్(Shanker) కాంబోలో రాబోతున్న తాజా మూవీ ‘గేమ్ ఛేంజర్’(Game Changer).

Update: 2024-12-22 08:12 GMT

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్(Shanker) కాంబోలో రాబోతున్న తాజా మూవీ ‘గేమ్ ఛేంజర్’(Game Changer). దిల్ రాజు(Dil Raju) నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్(Sri Venkateswara Creations) బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ మూవీలో కియారా అద్వాని(Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే అంజలి(Anjali), సునీల్(Sunil), సముద్ర ఖని(Samudrakani), ఎస్ జె సూర్య(Sj Surya) కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 10న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానున్నది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మూవీ ప్రమోషన్స్‌‌ను డిసెంబర్ 21 తేదీన డెల్లాస్‌లోని కర్టిస్ కల్వెల్ సెంటర్‌లో నిర్వహించారు.

ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు గేమ్ ఛేంజర్ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో(ఆంధ్రప్రదేశ్, తెలంగాణ) నెలకొన్న అనేక పరిస్థితులు ఈ సినిమా చూస్తున్నప్పుడు మీకు థియేటర్లలో కనిపిస్తాయి. కానీ, వాటిని శంకర్ నాలుగేళ్ల క్రితమే రాసుకున్నారు. అవి మీతో క్లాప్స్ కొట్టిస్తాయి. తెలుగు ప్రేక్షకులకు, దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని భాషల ఆడియన్స్‌కు ఈ సినిమా హై ఓల్టేజిని, కిక్కును ఇస్తుంది’ అని నిర్మాత దిల్ రాజు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ సినిమాపై మరింత హైప్‌ని పెంచేశాయి.

Tags:    

Similar News