జీవితంలో పెళ్లే చేసుకోనన్న సాయి ధరమ్ తేజ్ హీరోయిన్.. మ్యారేజ్ ఫొటోలు షేర్ చేస్తూ షాకింగ్ పోస్ట్
యంగ్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lakshmi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lakshmi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ భామ తమిళ, మలయాళ భాషా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఇక మన టాలీవుడ్‌లో ‘గాడ్సే’(Gadse) అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘అమ్ము’(Ammu), ‘పొన్నియన్ సెల్వన్’(Ponnian Selvan), ‘కుమారి’(Kumari), ‘కింగ్ ఆఫ్ కొత్త’(King Of Kotha) వంటి సినిమాల్లో నటించింది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) నటిస్తోన్న ‘సంబరాల ఏటిగట్టు’(SYG) అనే మూవీలో మనల్ని అలరించడానికి రెడీగా ఉంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.
అయితే ఈ భామ రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. ‘నేను జీవితంలో పెళ్లి చేసుకోను. బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. నాకు తెలిసిన చాలా మందిని చూశాను. ఒక్క జంట తప్పితే మిగిలిన వాళ్ళందరూ రాజీ పడి బతుకుతున్నట్లు అనిపించింది. పెళ్లి వల్ల చాలా మంది వ్యక్తిగతంగానూ ఎదగలేకపోతున్నారు. అందుకే మ్యారేజ్ వద్దని ఫిక్స్ అయ్యాను’ అని షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే ఈ బ్యూటీ తాజాగా తన ఫ్రెండ్ అయిన కీర్తి సురేష్ పెళ్లికి వెళ్లింది. అందుకు సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఇక ఈ పిక్స్ షేర్ చేస్తూ.. ‘కీర్తి సురేష్ నుంచి ఎలాగోలా తప్పించుకుని బయటపడ్డాను. ఎందుకంటే వృత్తిపరమైన ఫోన్ కాల్స్ అదేపనిగా వస్తూనే ఉన్నాయి. దాంతో పెళ్ళి వేడుకలయ్యేంత వరకు ఉండలేకపోయాను. పనుందని చెప్పి అక్కడి నుంచి వచ్చేశాను. కానీ కీర్తి- ఆంటోని మ్యారేజ్‌కి అటెండ్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. పెళ్లిలో నువ్వు(కీర్తి సురేష్) ఆనంద భాష్పాలు కారుస్తూ అతడిని(ఆంటోని తటిల్) హత్తుకోవడం చూసి మా కళ్లు చెమ్మగిల్లాయి. ఈ జ్ఞాపకాలన్ని నా మనసులో కలకాలం భద్రంగా దాచుకుంటాను. ఇంత మంచి అనుభూతి ఇచ్చినందుకు థాంక్యూ’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.