భార్యకి ప్రేమగా ఆమ్లెట్ చేసిచ్చిన మెగా హీరో.. మాస్టర్ చెఫ్ అంటూ హీరోయిన్ పోస్ట్

మెగా హీరో వరుణ్ తేజ్, సొట్ట బుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2024-12-21 07:14 GMT

దిశ, సినిమా: మెగా హీరో వరుణ్ తేజ్, సొట్ట బుగ్గల చిన్నది లావణ్య త్రిపాఠిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్నాళ్లుగా ప్రేమించుకున్న వీరు.. లాస్ట్ ఇయర్ ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ ‘మట్కా’ మూవీతో మన ముందుకు వచ్చి.. ఓకే ఓకే అనిపించుకున్నాడు. ఇక లావణ్య మ్యారేజ్ అయిన వన్ ఇయర్ తర్వాత రీసెంట్‌గా ‘సతీ లీలావతి’ అనే సినిమాలో నటిస్తోంది. అయితే మ్యారేజ్ తర్వాత సోషల్ మీడియాకే పరిమితమైన ఈ ముద్దుగుమ్మ.. నిత్యం లేటెస్ట్ ఫొటోస్, తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఫ్యాన్స్‌కి దగ్గరవుతూ ఉంటుంది.

ఈ క్రమంలో ఈ బ్యూటీ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా మెగా కోడలు లావణ్య తన ఇన్‌స్టా వేదికగా ఓ స్టోరీ పెట్టింది. అందులో ఎగ్ ఆమ్లెట్ ప్లేట్‌లో ఉన్న పిక్‌‌ను పెడుతూ.. ‘మాస్టర్ చెఫ్ వరుణ్ తేజ్’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు.. వావ్ సూపర్, లావణ్య చాలా లక్కీ వరుణ్ తేజ్ లాంటి వ్యక్తి భర్తగా రావడం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Tags:    

Similar News