Karthika Deepam: దీప కోసం ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటి నుంచి వెళ్ళిపోయిన కార్తీక్

కార్తీకదీపం ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

Update: 2024-12-21 08:57 GMT

దిశ, వెబ్ డెస్క్ : కార్తీకదీపం ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్

‘శౌర్యా .. జ్యో, తాతయ్య కింద ఉన్నారు.. ఇప్పుడు వల్ల ముందు ఎలాంటి ప్రశ్నలు అడగొద్దు.. వెళ్లాక చెబుతాను’ అని శౌర్య బ్యాగ్‌, టాబ్లెట్స్ తీసుకుని పదా అని చెబుతాడు. వెంటనే కార్తీక్‌కి కొన్ని సంఘటనలు గుర్తొచ్చి.. ఆగి.. చిన్నప్పుడు తనను చెరువులోంచి కాపాడినప్పుడు ఒక లాకెట్ దొరుకుతుంది.. అది తీసుకుని జేబులో వేసుకుంటాడు.

శౌర్యను తీసుకుని వెళ్లేసరికి.. జ్యో.. దీప మీద కోప పడుతూ అరుస్తూ ఉంటుంది. అమ్మా ఇక చాలు ఇంక ఆపు జ్యోత్స్నా ఆపు అంటూ కార్తీక్ ఆమెను నోరుమూయిస్తాడు. వెంటనే ‘ నేను మీవి ఏం పట్టుకుని వెళ్లడం లేదు’ ‘గుడ్ బై డియర్ మరదలా’ అంటూ కోపంగా చెప్పి దీప, శౌర్యలను చేతులు పట్టుకుని.. పదా అమ్మా అని అంటాడు. అప్పుడే శౌర్య.. ‘హాయ్ జ్యో.. హాయ్ ముద్దుల తాతా..’ అంటూ వారితో మాట్లాడుతూ.. ఇప్పుడు మాతో పాటు మీరు కూడా వస్తున్నారు కదా.. అని అంటుంది. వెంటనే కార్తీక్.. ‘లేదు శౌర్యా వాళ్ళు రావడం లేదు.. మనం మాత్రమే వెళ్తున్నాం’ అని శౌర్యకు చెబుతాడు.

దీప ఏడుస్తూ .. కార్తీక్‌ని మళ్ళీ అడగడానికి ప్రయత్నం చేస్తుంది కానీ, వినడు. దీప, శౌర్యల చేతిని పట్టుకుని కార్తీక్ నడుస్తాడు. ఇక జ్యో కి పట్టరాని కోపం వస్తుంది.. " దీపా నీ చావు ఎప్పటికైనా నా చేతిల్లోనే.. బావా నువ్వు ఎంత దూరం వెళ్ళినా నిన్ను వదిలిపెట్టను.. నాకు నువ్వు కావాలి.. అలాగే దీప కూడా చావాలి. ఆ దీప వల్లే అన్ని కష్టాలు వస్తున్నాయని తెలుసుకుంటాడు ’ అని మనసులో అనుకుంటుంది. ఇక్కడితో ఈ సీన్ ముగుస్తుంది.

Tags:    

Similar News