Prabhas' 'Rajasaab': కొత్త రిలీజ్ డేట్‌తో పాటు టీజర్ అప్‌డేట్ కూడా.. ప్రభాస్ ‘రాజాసాబ్’ సినిమాపై న్యూ బజ్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న వరుస ప్రాజెక్టులలో ‘రాజా సాబ్’ (Rajasaab) ఒకటి.

Update: 2025-03-14 13:07 GMT
Prabhas Rajasaab: కొత్త రిలీజ్ డేట్‌తో పాటు టీజర్ అప్‌డేట్ కూడా.. ప్రభాస్ ‘రాజాసాబ్’ సినిమాపై న్యూ బజ్
  • whatsapp icon

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న వరుస ప్రాజెక్టులలో ‘రాజా సాబ్’ (Rajasaab) ఒకటి. హారర్ కామెడీ (Horror comedy) జోనర్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి మారుతి (Maruti) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఆకట్టుకోగా.. తాజాగా ‘పెళ్లి కాని ప్రసాద్’ మూవీ ట్రైలర్ లాంచ్‌లో నటుడు సప్తగిరి ‘రాజా సాబ్’ చిత్రంపై చేసిన కామెంట్స్ మరింత హైప్‌ను క్రియేట్ చేశాయి. ఈ సినిమాలో ప్రభాస్‌ను మునిపెన్నడు చూడని విధంగా చూస్తారు. ఆయన కామెడీ వేరే లెవల్‌లో ఉంటుంది అని సప్తగిరి (Saptagiri) చేసిన కామెంట్స్‌తో డార్లింగ్ ఫ్యాన్స్ మరో కొత్త ఉత్సహం ఉరకలు వేసింది. దీంతో ఈ చిత్రం ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే రాజా సాబ్ రిలీజ్‌కు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియా (Social media)లో చక్కర్లు కొడుతోంది. అయితే.. ఏప్రిల్ 10న ‘రాజా సాబ్’ విడుదల కానున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పటి వరకు మూవీ నుంచి ఎలాంటి అప్‌డేట్స్ రాకపోవడం రిలీజ్ వాయిదా పడే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. కానీ, మేకర్స్ మాత్రం ఈ విషయంలో సైలెంట్‌గా ఉన్నారు. కానీసం కొత్త రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించడం లేదు. ఈ క్రమంలోనే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఏప్రిల్ 10న రాజాసాబ్ టీజర్ (Teaser) రిలీజ్ చేసి.. కొత్త రిలీజ్ డేట్‌(New release date)ను ప్రకటిస్తారు ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. కానీ, ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియకా డార్లింగ్ ఫ్యాన్స్ నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఈ మూవీలో బ్రహ్మానందం, అలీ, వెన్నెల కిషోర్, సప్తగిరి, గెటప్ శ్రీను, కోలీవుడ్ నటుడు యోగిబాబు, వీటీవీ గణేష్‌ తదితరులు నటిస్తున్నట్లు తెలుస్తోంది.

Read Also.. Court Movie Review : నాని ‘కోర్టు’ మూవీ రివ్యూ.. కచ్చితంగా చూడాల్సిన సినిమా.. 

Tags:    

Similar News

Palak Tiwari

Digangana Suryavanshi