Balakrishna: బాలయ్య అభిమానులకు బంపర్ ఆఫర్.. అది పొందాలంటే ఆ ఒక్క పని చేయాల్సిందే!
నందమూరి బాలకృష్ణ(Balakrishna) వరుస సినిమాలతో ఫుల్ స్వింగ్‌లో కుర్ర హీరోలకు పోటీనిస్తున్నారు.
దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ(Balakrishna) వరుస సినిమాలతో ఫుల్ స్వింగ్‌లో కుర్ర హీరోలకు పోటీనిస్తున్నారు. అంతేకాకుండా ఆయన నటించిన చిత్రాలు భారీ హిట్స్‌ను అందిస్తున్నాయి. ప్రస్తుతం బాలయ్య, బాబీ కొల్లి(Bobby Kolli) కాంబినేషన్‌లో వస్తున్న తాజా చిత్రం ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj). ఇందులో ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal ), శ్రద్ధా శ్రీనాథ్(Shraddha Srinath) హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్(Bobby Deol), చాందిని చౌదరి కీలక పాత్రలో కనిపించనున్నారు.
తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ క్రమంలో.. మూవీ మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసి వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. ఇదిలా ఉంటే.. విడుదలకు నెల ఉండగానే ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj) ప్రీ-రిలీజ్ డేట్ కూడా మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
అమెరికాలో జనవరి 4న టెక్సాస్‌లో ఈవెంట్ జరగనున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా బాలయ్య అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. డిసెంబర్ 31న లోగా ఆహా గోల్డ్(Aha Gold)ను సబ్‌స్కైబ్ చేసుకుంటే ‘డాకు మహారాజ్’ ఈవెంట్‌లో లాంజ్‌లో కూర్చొని బాలయ్యను కలిసే అవకాశం పొందవచ్చని వెల్లడించారు. ఈ మేరకు పోస్టర్‌ను షేర్ చేశారు. ఇక అది చూసిన బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.