Vijay Devarakonda: 2025లో అయినా పెళ్లి చేసుకుంటావా అనే ప్రశ్నకు రౌడీ హీరో ఆన్సర్ ఇదే.. పోస్ట్ వైరల్

యంగ్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2024-12-21 06:34 GMT

దిశ, సినిమా: యంగ్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అర్జున్ రెడ్డి సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈయన.. తర్వాత వరుస చిత్రాల్లో నటించాడు. కానీ అనుకున్నంతగా హిట్ కాలేకపోయాయి. అయినప్పటికీ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఇందులో భాగంగా ‘VD-12’ సినిమాతో తన లక్‌ను పరీక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఇతని వ్యక్తిగత విషయానికి వస్తే.. నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో ప్రేమలో ఉన్నట్లు పలు పుకార్లు వస్తున్నాయి. ఇక అప్పుడప్పుడు ఇద్దరు వేకేషన్స్‌కి వెళ్లిన ఫొటోలు, వీడియోలు బయటపడతంతో ఈ వార్తలకి ఇంకా బలం చేకూరినట్లు అయింది.

అయితే ఈ వార్తలపై అటు రష్మిక కానీ, విజయ్ కానీ స్పందించలేదు. ఈ క్రమంలో రౌడీ హీరో పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా విజయ్ దేవరకొండ తన ఇన్‌స్టా వేదికగా ఓ స్టోరీ పెట్టాడు. అందులో సూపర్ స్టార్ రజనీకాంత్ మీమ్ వీడియోపై.. ‘కనీసం 2025లో అయినా పెళ్లి చేసుకుంటావా’ అని రాసి ఉంది. దానికి రజనీ కాంత్ ఆన్సర్ చెప్పలేక నవ్వే వీడియోని అటాచ్ చేసి తన స్టోరీలో అప్లోడ్ చేశాడు. దీంతో ఈ పోస్ట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన ఫ్యాన్స్.. అన్నా వచ్చే సంవత్సరం కూడా పెళ్లి చేసుకునేలా లేవుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Tags:    

Similar News