Allu Arjun : అల్లు అర్జున్ మాటలకు ఎమోషనల్ అయిన రష్మిక

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న మూవీ పుష్ప 2

Update: 2024-12-03 04:18 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun) హీరోగా తెరకెక్కుతున్న మూవీ పుష్ప 2. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సోమవారం రాత్రి హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్లో హీరో అల్లు అర్జున్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. " పుష్ప1 సమయంలో నేను ఈ కథను వినలేదు. కానీ, నాకు చాలా నమ్మకం ఉంది పుష్ప 2 ( Pushpa 2) అస్సలు తగ్గేదేలే అని. మూడేళ్ల తర్వాత మళ్ళీ మీ ముందుకొచ్చాను. మా ప్రొడ్యూసర్స్ మైత్రి నవీన్ గారికి, మైత్రి రవి గారు వీళ్ళు కాకుండా ఇంకెవరు సినిమా తీయలేరు. మమ్మల్ని నమ్మి ఈ మూవీ పై కోట్లు ఖర్చు పెట్టినందుకు మీకు చాలా థ్యాంక్స్. నా ఫ్రెండ్ దేవిశ్రీ ప్రసాద్ ( Devi Sri Prasad) గురించి ఎంత చెప్పినా తక్కువే. మా జర్నీ ఇప్పటిది కాదు.. ఇరవై ఏళ్ల నుంచి ఉంది. ఫహద్ ఫజల్ ( Fahadh Faasil) గారు బాగా నటించారు. ఫస్ట్ హాఫ్ ఐపోయిన తర్వాత ఆయన నటన గురించి అందరూ మాట్లాడుకుంటారు. కేరళ వాళ్ళు అంతా ఆయనను చూసి గర్వపడతారు. ఈ మూవీలో స్పెషల్ సాంగ్ చేసిన శ్రీలీలను చూసి మన తెలుగు వాళ్ళు అందరూ ఆదర్శంగా తీసుకుంటారు. తెలుగు వాళ్ళు గర్వించే స్థాయికి మమ్మల్ని తీసుకుని వెళ్లాలని కోరుకుంటున్నాను. ఐదేళ్ళ నుంచి నాతో కలిసి పని చేస్తున్న రష్మిక గురించి కొంచం స్పెషల్ గా చెప్పాలి. తన ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే ఎలా గడిచేదో కూడా నాకు తెలియదు. రెండు రోజులపాటు నిద్ర కూడా లేకుండా పీలింగ్స్ సాంగ్ కోసం పనిచేసింది. నిద్రపోయావా అని అడిగితే లేదు అంది. తను అలా చెప్పడంతో చాలా బాధగా అనిపించింది. ఈ మూవీ నీకు గొప్ప పేరు తీసుకువస్తుందని " అన్నాడు. దీంతో బన్నీ మాటలకు రష్మిక చాలా ఎమోషనల్ అయింది.

Read More : Pushpa -2 విడుదల కాకముందే పార్ట్-3 గురించి బిగ్ అప్డేట్ ఇచ్చిన సుకుమార్.. ఖుషిలో ఫ్యాన్స్!

Tags:    

Similar News