భర్త, పాపతో అక్కడ ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్ బ్యూటీ.. నెట్టింట ఆకట్టుకుంటున్న పోస్ట్
బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయ్యింది.
దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమయ్యింది. అలా ఎన్నో సినిమాల్లో నటించి స్టార్‌డమ్ తెచ్చుకుంది. ఇక దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్(RRR) మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో తన అందం, నటనతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఇక ఈ భామ వ్యక్తిగత విషయానికి వస్తే.. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్‌తో కొన్నాళ్లు డేటింగ్‌లో ఉండి గతేడాది పెళ్లి చేసుకుంది.
ఇక వీరి ప్రేమకు గుర్తుగా రాహా అనే పాప కూడా జన్మించింది. ప్రస్తుతం అలియా ఓ పక్కా సినిమాలతో మరో పక్క ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. తాజాగా అలియా ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో తన భర్త, కూతురితో న్యూ ఇయర్ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారగా.. వీటిపై నెటిజన్లు ‘క్యూట్ ఫ్యామిలీ’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి అలియా పోస్ట్ పై మీరు ఓ లుక్ వేసేయండి.