Pushpa 2: పుష్ప 2 టీజర్ అచ్చం దింపేసిన బుడ్డోడు.. మరీ ఇంత టాలెంటెడ్ ఉన్నావేంట్రా అంటూ..!!

దేశవ్యాప్తంగా ఈగర్‌గా ఎదురుచూస్తోన్న ‘పుష్ప-2’ మరో మూడ్రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Update: 2024-12-01 12:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఈగర్‌గా ఎదురుచూస్తోన్న ‘పుష్ప-2’(Pushpa 2) మరో మూడ్రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మూవీ టీమ్ వరుస అప్డేట్స్ వదులడంతో జనాల్లో విపరీతమైన క్యూరియాసిటీ నెలకొంటోంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్(Sukumar) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రమోషన్ల బిజీలో పడిపోయిన చిత్రయూనిట్‌కు తాజాగా ఓ బుడ్డోడు ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు. చతుర్(chathur) అనే ఓ బాబు అచ్చం పుష్ప గెటప్‌(Puṣpa geṭap)లో అల్లు అర్జున్(Allu Arjun) ఎలా ఉన్నాడో అలగే రెడీ అయ్యాడు.

అంతేకాకుండా ఈ పిల్లాడు ఈ చిత్ర టీజర్ ను సేమ్ షూట్ చేసి వీడియో సోషల్ మీడియాలో పంచుకున్నాడు. సేమ్ ఐకాన్ స్టార్ మాస్ జాతర ఎపిసోడ్‌ కు తయారు అయినట్లే రెడీ అయి.. అచ్చం బన్నీ యాటిట్యూడ్‌తో నటించి అదరగొట్టాడు. లాస్ట్‌లో టీజర్ సంతోష్ ముత్యాలయ(Santosh Mutyalaya) డైరెక్షన్‌లో వచ్చిందని వెల్లడించారు. చతుర్ చేసిన ఈ వీడియోకు సోషల్ మీడియాలో భారీ స్పందన లభిస్తోంది. ఈ వీడియో అల్లు అర్జున్ చూసి ఏలా రెస్పాండ్ అవుతారో చూడాలి. కాగా బన్నీ తప్పకుండా ఈ బుడ్డోడి టీజర్ చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Read More...

Pushpa 2 -Traffic Advisory: పుష్ప మాస్ జాతరకు హైదరాబాద్‎లో రోడ్లు క్లోజ్.. ట్రాఫిక్ డైవర్షన్ లిస్ట్ ఇదే


Full View
Tags:    

Similar News