Pushpa 3 : పుష్ప 3 రిలీజ్ ప్రకటించిన నిర్మాత

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్(Sukumar) కాంబినేషన్లో వచ్చిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ "పుష్ప"(Pushpa).

Update: 2025-03-16 13:22 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), సుకుమార్(Sukumar) కాంబినేషన్లో వచ్చిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ "పుష్ప"(Pushpa). దీనికి సీక్వెల్ గా "పుష్ప 2: ది రూల్"(Pushpa 2 : The Rule) కూడా ఇండియన్ ఫిల్మ్ రికార్డ్స్ కొల్లగొట్టింది. కాగా దీనికి మరో పుష్ప 3(Pushpa 3) కూడా సీక్వెల్ వస్తుందంటూ చిత్ర యూనిట్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 'పుష్ప 3' ఎప్పుడు రానుందో ప్రకటించారు ప్రొడ్యూసర్. మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మాత రవిశంకర్ తాజాగా "రాబిన్ హుడ్"(Rabinhood) ప్రమోషన్స్ కోసం విజయవాడ వెళ్ళారు. అక్కడ నిర్వహించిన ఈవెంట్లో 'పుష్ప 3' విడుదల వివరాలను ప్రకటించారు. 2028 లో "పుష్ప 3 : ది ర్యాంపేజ్"(Pushpa 3 : The Rampage) ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం బన్నీ తన నెక్స్ట్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడని, అవి పూర్తి కాగానే, తిరగి పుష్ప 3 పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. 2021లో పుష్ప ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు జాతీయ అవార్డు దక్కింది. ఇక దీని సీక్వెల్ "పుష్ప 2 : ది రూల్" గత డిసెంబరులో విడుదలై కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమాలో రష్మిక మందన, ఫహాద్ ఫజిల్, సునీల్, అనసూయ, జగపతిబాబు, జగదీష్ ముఖ్య పాత్రలు పోషించారు. రెండవ సీక్వెల్ చివరలో పుష్పరాజ్ పై బాంబు దాడి జరిగిన సీన్ తో ముగియగా.. నెక్స్ట్ సీక్వెల్ మరింత థ్రిల్లింగ్ గా ఉండనుందని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం బన్నీ అట్లీ డైరెక్షన్లో తెరకెక్కనున్న సినిమాపై ఫోకస్ పెట్టాడు.

Tags:    

Similar News