సెకెండ్ ఇన్నింగ్స్‌లో సత్తా చూపిస్తోన్న ప్రభాస్ హీరోయిన్.. ఏకంగా ఏడు సినిమాలతో..

‘వర్షం’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2024-12-02 05:42 GMT

దిశ, సినిమా: ‘వర్షం’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి ఫేమ్ సంపాదించుకున్నది. తన నటనతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన ఈ ముద్దుగుమ్మ సడెన్‌గా కొన్నేళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ప్రస్తుతం మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. తన సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ సత్తా చాటుతుంది.

గత ఏడాది ‘లియో’ సినిమాలో దళపతి విజయ్‌కు జోడీగా నటించి మంచి విజయాన్ని అందుకుంది. త్వరలోనే చిరంజీవి ‘విశ్వంభర’ మూవీతో టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇస్తోంది. అయితే ఈ సినిమాతో పాటు ఏకంగా ఏడు సినిమాలు లైన్ లో పెట్టింది ఈ బ్యూటీ. అజిత్ హీరోగా వస్తోన్న ‘విదాముయార్చి’ సంక్రాంతికి రానుంది. దీని తర్వాత అజిత్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, అలాగే కమల్ హాసన్‌తో ‘థగ్ లైఫ్’, మలయాళంలో మోహన్ లాల్‌తో ‘రామ్’, సూర్య 45లోనూ త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. ఇవే కాకుండా మలయాళంలో ‘ఐడెంటిటీ’ అనే సినిమా కూడా చేస్తుంది. ఇలా వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్స్‌కి పోటీ ఇస్తుంది త్రిష. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Tags:    

Similar News