Vikrant Massey: దయచేసి విక్రాంత్ మస్సేను విమర్శించకండి.. డైరెక్టర్ ఆసక్తికర పోస్ట్

బ్లాక్ బస్టర్ హిట్ ‘12th ఫెయిల్’ సినిమా హీరో విక్రాంత్ మస్సే(Vikrant Massey) నటనకు బ్రేక్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

Update: 2024-12-03 06:11 GMT

దిశ, సినిమా:  బ్లాక్ బస్టర్ హిట్ ‘12th ఫెయిల్’ సినిమా హీరో విక్రాంత్ మస్సే(Vikrant Massey) నటనకు బ్రేక్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. 2025లో వచ్చేదే తన చివరి మూవీ అని వెల్లడించాడు. ఆయన ఫ్యామిలీ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇన్‌స్టాగ్రామ్(Instagram) ద్వారా ఓ ప్రకటన విడుదల చేశాడు. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కెరీర్ పీక్స్‌లో ఉండగా నటనకు బ్రేక్ ఇవ్వడంతో ఆయనతో బలవంతంగా ఎవరో అలా చెప్పించారని కొందరు పలు రకాలుగా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, దీనిపై బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ గుప్తా(Sanjay Gupta) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా(Social Media) ద్వారా వరుస పోస్టులు పెట్టారు. ‘‘సినీ ఇండస్ట్రీలోని వారు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే ఎంతో ఆలోచించాలి. ధైర్యం కావాలి. 

అయితే 2008లో డైరెక్టర్ హన్సల్ మెహతా(Hansal Mehta) విరామం తీసుకున్నారు. ముంబయిని విడిచిపెట్టారు. కుటుంబంతో సహా ఒక గ్రామానికి వెళ్లారు. ఆ తర్వాత 2012లో ‘షాహిద్’(Shahid) సినిమాతో గొప్ప రీఎంట్రీ ఇచ్చారు. అది తన కెరీర్‌లో అత్యుత్తమ చిత్రంగా నిలిచింది. అప్పటి నుంచి ఎన్నో విజయాలు సొంతమయ్యాయి. వారి ప్రతిభపై వారికి నమ్మకం ఉన్నప్పుడే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఒక విధంగా విక్రాంత్(Vikrant Massey) ఇప్పుడు ఆయన బాటలో వెళ్తున్నాడు. ఈ పోటీ, అభద్రత, అసూయలతో నిండిన సమయం నుంచి కొంత విరామం తీసుకోవాలనుకుంటున్నాడు. తండ్రిగా, భర్తగా, కుమారుడుగా తనకున్న బాధ్యతపై దృష్టి పెట్టాలనుకుంటున్నాడు. కాబట్టి ఎవరూ అతన్ని విమర్శించకండి. విక్రాంత్ నిర్ణయం సరైనది అని నాకు అనిపిస్తుంది’’ అని రాసుకొచ్చారు.

Tags:    

Similar News