దిశ, వెబ్‌డెస్క్: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కి సంబంధించిన కొన్ని సీక్రెట్ ఫొటోస్ బయటకొచ్చాయి. ఈ ఫొటోస్ మీరు ఎంత వెతికినా సోషల్ మీడియాలో కానీ, గూగుల్‌లో కానీ దొరకడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అయితే ఇంతకీ ఈ ఫొటోల్లో ఏముంది..? ఈ ఫొటోలు ఎందుకంత స్పెషల్..? ఈ క్వశ్చన్స్‌కి ఇప్పుడు ఆన్సర్ తెలుసుకుందాం.
పవర్ స్టార్ ఫిట్‌నెస్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. యంగ్ ఏజ్‌లోనే మార్షల్ ఆర్ట్స్‌లో ట్రైనింగ్ తీసుకున్న పవన్ కల్యాణ్.. ఆ ఫిట్‌నెస్‌ని అలాగే కాపాడుకుంటూ వస్తున్నారు. ఇక తాజాగా ఆయనకు సంబంధించిన కొన్ని సీక్రెట్ ఫొటోస్ బయటకొచ్చాయి. ఈ ఫొటోల్లో ఆయన ఏకంగా యోగా చేస్తూ కనిపిస్తున్నారు. సర్వాంగాసనం, మయూరాసనం వంటి ఆసనాలను అలవోకగా వేస్తూ కనిపించారు. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు.. ‘మరీ ఇంత అలవోకగా యోగా ఎలా చేస్తున్నావ్ బాసూ..?’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ ఫొటోలను చూస్తే మీకేం అనిపిస్తోంది..?
ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్‌కి అటు సినిమాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ ఉన్న క్రేజ్ ఎలాంటిదో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ మధ్య తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో కంప్లీట్‌గా సనాతన ధర్మ పరిరక్షకునిగా అవతారం ఎత్తిన పవన్ కల్యాణ్ ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. ఇలాంటి టైంలో యోగాసనాలు వేస్తున్న పవన్ ఫొటోలు వైరల్ కావడంతో ఫ్యాన్స్ వీటిని సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
Read more: పవన్ కల్యాణ్‌కు అస్వస్థత.. ఆందోళనలో ఫ్యాన్స్