Aish-Abhishek: మరోసారి ఆ రూమర్స్‌కి చెక్ పెట్టిన ఐష్- అభిషేక్.. ఫొటో వైరల్
బాలీవుడ్ స్టార్ కపూల్ ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ కపూల్ ఐశ్వర్యరాయ్- అభిషేక్ బచ్చన్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని సినిమాల్లో జంటగా నటించిన వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆరాధ్య అనే పాప కూడా జన్మించింది. అయితే గత కొన్ని నెలలుగా ఐష్, అభిషేక్ విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ, దీనిపై ఇప్పటి వరకు ఈ జంట స్పందించలేదు. అయినప్పటికీ వీరి డివోర్స్ వార్తలు రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉంది. ఈ క్రమంలో వీరిద్దరికి సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తాజాగా ఐష్, అభిషేక్, ఆరాధ్య విమానాశ్రయం నుంచి బయటకు రావడం కనిపించింది. వారు లోపల ఉన్న షట్టర్ బగ్‌లకు హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ కూడా తెలిపారు. అయితే వీరు హాలిడేస్ తర్వాత మళ్లీ ముంబైకి తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఫొటోలో అభిషేక్ బ్లాక్ ప్యాంట్ అండ్ వైట్ షూస్, బ్లూ స్వెట్ షర్ట్‌లో ఉండగా, ఐష్ బ్లాక్ కలర్ డ్రెస్‌లో అండ్ డాటర్ ఆరాధ్య మాత్రం బ్లూ కలర్ డ్రెస్‌లో దర్శనమిచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. విడాకుల వార్తలకి చెక్ పడినట్లే కదా అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా రీసెంట్‌గా కూడా ఐష్, అభిషేక్ తన గారాలపట్టి స్కూల్ ఈవెంట్‌లో కలిసి కనిపించిన వీడియో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.