నిత్యామీనన్‌తో జయం రవి ప్రేమాయణం.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

కోలీవుడ్ నటుడు జయం రవి(Jayam Ravi), నిత్యామీనన్(Nithya Menon) జంటగా నటిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ ‘కాదలిక్క నేరమిళ్లై’(Kadhalikka Neramillai).

Update: 2024-12-22 02:04 GMT

దిశ, సినిమా: కోలీవుడ్ నటుడు జయం రవి(Jayam Ravi), నిత్యామీనన్(Nithya Menon) జంటగా నటిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ ‘కాదలిక్క నేరమిళ్లై’(Kadhalikka Neramillai). దీనిని కిరుతిగ ఉదయనిధి(Udhayanidhi Stalin) దర్శకత్వం తెరకెక్కిస్తుండగా.. యోగిబాబు, వినయ్ రాయ్(Vinay Roy), లాల్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. రెడ్ జెయింట్(Red giant) సంస్థ దీనిని నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్(AR Rahman) సంగీతం అందిస్తున్నారు.

అయితే ఈ మూవీ గత ఏడాది ప్రారంభమైనప్పటికీ ఇంకా విడుదల కాలేదు. అయితే ‘కాదలిక్క నేరమిళ్లై’(Kadhalikka Neramillai) సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. తాజాగా, ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ విడుదలైంది. ఇందులో జయం రవి, నిత్యామీనన్ ప్రేమించుకుంటారు. మొత్తం కారులో వెళ్తూ ప్రేమలో తేలిపోతుంటారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.


Full View


Tags:    

Similar News