Allu Arjun: అల్లు అర్జున్ నటనకు ఆస్కార్ ఇవ్వాల్సిందే అంటున్న నెటిజన్లు.. బయటపడ్డ సెన్సేషనల్ వీడియో

అల్లు అర్జున్(Allu Arjun) నటించిన ‘పుష్ప-2’(Pushpa 2: The Rule ) సినిమా విడుదలకు ముందు ప్రీమియర్స్ వేయగా.. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే.

Update: 2024-12-22 08:31 GMT

దిశ, సినిమా: అల్లు అర్జున్(Allu Arjun) నటించిన ‘పుష్ప-2’(Pushpa 2: The Rule ) సినిమా విడుదలకు ముందు ప్రీమియర్స్ వేయగా.. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఓ మహిళ మృతి చెందగా.. ఐదేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆ బాబుకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో.. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఘటనపై మాట్లాడటం హాట్ టాపిక్‌గా మారింది. ఇక దీనిపై రాజకీయ నాయకులతో పాటు సామాన్య ప్రజలు కూడా స్పందిస్తూ.. సీఎంకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

దీంతో వెంటనే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారు. నా తప్పు లేకపోయినా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. అలాగే ఆ బాబు బాలేడని ఎలాంటి ఈవెంట్స్ కూడా నిర్వహించకూడని మూవీ మేకర్స్‌కు చెప్పానని తెలిపారు. ఈ క్రమంలో.. తాజాగా, ఓ సెన్సేషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఆయన పుష్ప-2 సక్సెస్ సెలబ్రేషన్స్‌ను సుకుమార్‌(Sukumar)తో కలిసి చేసుకున్నారు. అలాగే పలు ఈవెంట్స్‌కు కూడా హాజరై సందడి చేశారు. ఇక అల్లు అర్జున్, చికిత్స తీసుకుంటున్న బాబు వీడియోను పోస్ట్ చేస్తూ హార్ట్ ఐకాన్ స్టార్‌కు హార్ట్ లేదని కామెంట్లు పెడుతున్నారు. ఆయన నటనకు ఆస్కార్ అవార్డు ఇవ్వాల్సిందే అని దారుణంగా మాట్లాడుతున్నారు.

Tags:    

Similar News