Vishnu Manchu: సంచలన పోస్ట్ పెట్టిన మంచు విష్ణు .. తమ్ముడు కోసమే అంటూ కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్

ప్రతీ కష్టంలో మీ పక్కనే ఉండే వారిని ఎప్పటికీ మర్చిపోవద్దు

Update: 2025-01-02 03:00 GMT

దిశ, వెబ్ డెస్క్ : కొత్త ఏడాది సందర్భంగా సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీస్ వరకు న్యూ ఇయర్ విషెస్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ క్రమంలోనే తెలుగు నటుడు మంచు విష్ణు ( Vishnu Manchu) సంచలన పోస్ట్ పెట్టారు. ప్రసుతం, ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

" జీవితంలో ఎదురయ్యే  ప్రతీ కష్టంలో మీ పక్కనే ఉండే వారిని ఎప్పటికీ మర్చిపోవద్దు. మీ కలలను నెరవేర్చుకోవడం ఎంత ముఖ్యమో కుటుంబం కూడా అంతే ముఖ్యం. ఇక్కడ ప్రేమ మాత్రమే ఉంటుంది. హర్ హర్ మహాదేవ్! జై శ్రీ రామ్! " అంటూ పోస్టులో రాసుకొచ్చారు. అయితే, ఈ పోస్ట్ పై నెటిజన్స్ రక రకాల కామెంట్స్ చేస్తున్నారు.

గత కొన్ని రోజుల నుంచి మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. తమ్ముడు మనోజ్ ను ఉద్దేశిస్తూ విష్ణు ఈ పోస్ట్ చేసి ఉంటారని నెటిజన్లు అంటున్నారు. మనోజ్ ( Manchu Manoj) కలను నెరవేర్చుకునే సమయంలో కుటుంబం పాత్ర కూడా ఉందని, ఇప్పుడు అవన్నీ మరిచిపోయి కన్న తండ్రిపై దాడి చేసేందుకు ప్రయత్నించడం కరెక్ట్ కాదనే యాంగిల్ లో ఈ కామెంట్స్ చేశారని భావిస్తున్నారు.


Click Here For Tweet 

Tags:    

Similar News