వాడికి అన్ని కోట్లు అవసరమా అంటూ ఆ డైరెక్టర్ మీద మండిపడుతున్న నెటిజెన్స్?

విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న మూవీ 'ఖుషి'.

Update: 2023-08-21 09:28 GMT
వాడికి అన్ని కోట్లు అవసరమా అంటూ ఆ డైరెక్టర్ మీద మండిపడుతున్న నెటిజెన్స్?
  • whatsapp icon

దిశ,వెబ్ డెస్క్: విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న మూవీ 'ఖుషి'. ఈ సినిమాలో విజయ్ కు జోడిగా సమంత నటించింది. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. విజయ్ ఆశలు పెట్టుకున్న లైగర్‌ మూవీ డిజాస్టర్ అయింది. టక్ జగదీష్ సినిమా శివ నిర్వాణకు నిరాశను మిగిల్చింది. ఇక సమంత విషయానికొస్తే.. శాకుంతలం మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. వీరి క్రేజ్ ను బట్టి వీరికి రెమ్యూనరేషన్లు ఫిక్స్ చేస్తారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. విజయ్ దేవరకొండ ఈ ఖుషి సినిమాకు అక్షరాలా రూ. 23 కోట్లు తీసుకున్నాడని టాక్ బాగా నడుస్తుంది. సామ్ అయితే రూ.4.5 కోట్లు తీసుకుందట. శివ నిర్వాణ అయితే రూ.12 కోట్లు తీసుకున్నాడనే వార్తలు బాగా విపిస్తున్నాయి. వాడికి అన్ని కోట్లు పెట్టడం అవసరమా అంటూ డైరెక్టర్ మీద నెటిజెన్స్ మండిపడుతున్నారు. ఈ వార్తలపై శివ నిర్వాణ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి.


Similar News