Vignesh Sivan: ఆ వార్తలకు చెక్ పెట్టిన నయనతార భర్త.. అందుకే సీఎంను కలిశానంటూ పోస్ట్
లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara),విగ్నేష్ శివన్(Vignesh Sivan) దంపతులు ఓ రెస్టారెంట్‌ను కొనాలనుకున్నారని గత కొద్ది రోజుల నుంచి వార్తలు వైరల్ అవుతున్నాయి.
దిశ, సినిమా: లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara),విగ్నేష్ శివన్(Vignesh Sivan) దంపతులు ఓ రెస్టారెంట్‌ను కొనాలనుకున్నారని గత కొద్ది రోజుల నుంచి వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే అది ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి కావడంతో ఓ మంత్రి దానిని అమ్మడానికి నిరాకరించారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయినప్పటికీ విగ్నేష్ మాత్రం దానిని కొనాలనే పట్టుబట్టినట్లు దానికోసం సీఎంను కూడా కలిసినట్లు ఓ న్యూస్ సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది.
ఈ క్రమంలో.. తాజాగా, విగ్నేష్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ ఓ పోస్ట్ పెట్టారు. ‘‘పాండిచ్చేరిలోని ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాను అని జరుగుతున్న ప్రచారం అర్థం లేనిది. నేను అసలు నా సినిమా ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ షూటింగ్ పర్మిషన్ కోసం పాండిచ్చేరి ఎయిర్ పోర్టుకు వెళ్లాను. అక్కడ అనుకోకుండా ముఖ్యమంత్రి(Chief Minister), పర్యాటక శాఖ మంత్రి(Minister of Tourism)ని మర్యాదపూర్వకంగా కలిశాను.
కరెక్ట్‌గా అదే సమయానికి వచ్చిన లోకల్ మేనేజర్ అనుకోకుండా నా మీటింగ్ తర్వాత ఆయనను ఏదో అడిగారు. అది పొరపాటున నాకు లింక్ చేశారు. ఎటువంటి అర్థం లేకుండా సృష్టించే మీమ్స్, జోక్స్ ఫన్నీగా ఉంటాయి. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ క్లారిటీ ఇవ్వాలుకుంటున్నాను కాబట్టి ఈ పోస్ట్ పెడుతున్నాను’’ అని రాసుకొచ్చారు. ప్రజెంట్ విగ్నేష్ శివన్ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.