NANDAMURI MOKSHAGNA: బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ పూర్తి పేరేంటో తెలుసా..? అస్సలు ఊహించి ఉండరుగా

నందమూరి బాలకృష్ట వారసుడు మోక్షజ్ఞ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Update: 2024-09-08 02:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి బాలకృష్ట వారసుడు మోక్షజ్ఞ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇతను సినిమాల్లోకి ఎప్పుడెప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని బాలయ్య ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎట్టకేలకు మోక్షజ్ఞ పుట్టిన రోజైన శుక్రవారం (సెప్టెంబర్ 06)న బాలయ్య తనయుడి ఎంట్రీపై అధికారిక ప్రకటన వచ్చేసింది. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బాలయ్య కుమారుడి మొదటి మూవీకు దర్శకత్వం వహించనున్నారు. SLV బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి, బాలయ్య చిన్న కూతురు మతుకమిల్లి తేజస్విని నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇదే సందర్భంగా మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. అందులో ఇతని హ్యాండ్‌సమ్ లుక్‌‌ను చూసి నందమూరి అభిమానులు కూడా లుక్ అదిరిపోయిందంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా హీరోయిన్, మూవీ జానర్, ఇతర టెక్నీషియన్ల గురించి త్వరలోనే అప్ డేట్స్ రానున్నాయని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. మోక్షజ్ఞకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ఇందులో ఒక ఆసక్తికర విషయం బయటపడింది. అదేంటంటే మోక్షజ్ఞ పూర్తి పేరు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన పోస్టులో 'నందమూరి తారక రామ మోక్షజ్ఞ తేజ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ పూర్తి పేరు రాసుకొచ్చాడు. దీంతో మోక్షజ్ఞ పేరులో తాతయ్య తారక రామ పేరు కూడా ఉండటంతో అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. తాతయ్య, నాన్న పేర్లను నిలబెట్టేలా మోక్షు కూడా మంచి హీరోగా ఎదుగుతాడంటూ నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.


Similar News