సైలెంట్‌గా పెళ్లి చేసుకొని సడెన్ షాక్ ఇచ్చిన సిద్ధార్థ్- అదితిరావు.. నెట్టింట వైరల్ అవుతున్న పిక్స్

హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

Update: 2024-09-16 07:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితి రావుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరు.. రీసెంట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకొని వీరి ప్రేమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ లవ్ బర్డ్స్ నిశ్చితార్థం చేసుకున్న ఆలయంలోనే పెళ్లి చేసుకుంటామని తెలిపారు. కానీ డేట్ మాత్రం ప్రకటించలేదు. అలా ఎంగేజ్‌మెంట్ ఎవరికీ తెలియకుండా సైలెంట్‌గా చేసుకున్న ఈ జంట ఇప్పుడు పెళ్లి కూడా సైలెంట్‌గా చేసేసుకున్నారు.

సెప్టెంబర్ 16న (సోమవారం) సిద్దార్థ్ – అదితిరావు హైదరి మూడు ముళ్ల బంధంతో ఒకటయ్యారు. కాగా వీరి వివాహం వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథ స్వామి ఆలయంలో కేవలం కుటుంబ సభ్యుల మధ్యే జరిగింది. ఈ వేడుకకు సినీ సెలబ్రిటీలు ఎవరూ హాజరు కాకపోవడం గమనార్హం. అయితే వీరిద్దరు పెళ్లి ఫొటోలు షేర్ చేస్తూ ఒకే క్యాప్షన్ జత చేశారు. ఇక సిద్దార్థ్- అదితి పెళ్లి ఫొటోలు చూసిన వారంతా కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

(video link credits to aditi rao hydari instagram id)


Similar News