'దేవర' మేకింగ్ వీడియో చూశారా..? వామ్మో ఏకంగా సముద్రాన్నే సృష్టించేశారుగా..

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘దేవర’.

Update: 2024-09-16 09:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘దేవర’. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులకు ఈ అమ్మడు పరిచయం కానుంది. సెప్టెంబర్ 27న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో రిలీజ్ డేట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన టీజర్, పోస్టర్స్, సాంగ్స్ అన్ని ఈ సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. ప్రస్తుతం దేవర మూవీ యూనిట్ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది.

ఈ క్రమంలో నిన్న సందీప్ రెడ్డి వంగతో దేవర టీమ్ చేసిన స్పెషల్ ఇంటర్వ్యూ రిలీజ్ చేశారు. దీంతో ఈ ఇంటర్వ్యూ కాస్త వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో దేవర మేకింగ్ వీడియో నెట్టింట ఆకట్టుకుంటుంది. అందులో భాగంగా ఈ సినిమాలో ఆల్మోస్ట్ అరగంట సేపు నీళ్ళల్లో సాగే యాక్షన్ సీక్వెన్స్ కోసం రామోజీ ఫిలిం సిటీలో భారీ పూల్(Swimming Pool)ను ఏర్పాటు చేశారు. ఈ పూల్‌నే ఒక సముద్రంగా సృష్టించారు. ఇక నీళ్ళల్లో ఉండే ఫైట్ సీన్స్ అన్ని ఇక్కడే షూట్ చేసారు. కాగా దేవర ఇంటర్వ్యూలో మేకింగ్ వీడియో చూస్తే బాగా కష్టపడ్డారు అని తెలుస్తోంది. అలలు వచ్చేలా చేయడం, మరబోట్లు తీసుకురావడం, నీళ్ళల్లో కెమెరాను పెట్టి షూట్ చేయడం.. ఇలా మేకింగ్ వీడియోలో ఆసక్తికరంగా చూపించారు. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర మేకింగ్ వీడియో విజువల్స్‌ని సపరేట్‌గా కట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మరి మీరు కూడా దేవర మేకింగ్ వీడియో చూసేయండి.

(video link credits to suresh pro X account)


Similar News