Bigg Boss: ప్రేరణ ఇంట్లో తీవ్ర విషాదం..! షాకింగ్ డెసిషన్ తీసుకున్న బిగ్‌బాస్..?

సెప్టెంబర్ 1న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకుంది.

Update: 2024-09-18 03:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: సెప్టెంబర్ 1న ప్రారంభమైన బిగ్ బాస్ (bigg boss)తెలుగు సీజన్ 8 ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకుంది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లో అడుగు పెట్టగా.. బేబక్క(bebakka), శేఖర్ భాషా(shekhar bhasha) ఇప్పటికే ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం 12 కంటెస్టెంట్స్ ఎవరికి వారు హైలెట్ అయ్యే పనిలో ఉన్నారు. వీరిలో సీరియల్ యాక్టర్ ప్రేరణ(prerana) కుంభం కూడా ఒకరు.. ఈ అమ్మడు షో స్టార్టింగ్ నుంచి యాక్టివ్‌గా ఉంటూ నామినేషన్స్ నుంచి తప్పించుకుంటూ వస్తుంది. ఇక మూడో వారంలో కూడా ఆమె నామినేట్ అయింది.

ఇదిలా ఉండగా తాజాగా ఆమె ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రేరణ భర్త వాళ్ళ అమ్మమ్మ తాజాగా కన్నుమూసినట్టు తెలుస్తోంది. కానీ ప్రస్తుతం ప్రేరణ బిగ్ బాస్ హౌస్‌లో ఉంది కాబట్టి ఆమెకు ఈ వార్త గురించి తెలిసే అవకాశం లేదు. అది ఈరోజు ఎపిసోడ్‌లో బిగ్ బాస్ ద్వారా తెలియబోతుందని అంటున్నారు.. ఈ వార్త తెలిస్తే ఆమె ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది. ఆ కార్యక్రమాలు అయ్యేవరకు బిగ్ బాస్ ఆమెను ఇంటికి పంపిస్తారా? లేదా సడెన్ ఎలిమినేషన్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.. ఒకవేళ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఉన్న ప్రేరణ ఈ కారణంతో అర్ధాంతరంగా ఆటను ఆపేసి ఇంటికి వెళ్ళిపోతే అది ఆమెతో పాటు ఆమె అభిమానులకు కూడా నిరాశను కలిగించే విషయం అవుతుంది.. మరి ఈ సస్పెన్స్ వీడాలంటే ఈరోజు ఎపిసోడ్(today episode) మిస్ అవ్వకుండా చూడాల్సిందే. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Read More..

Bigg Boss Season-8: హౌజ్‌‌లో ఏం జరుగుతుంది.. టార్గెట్‌గా మణికంఠ.. అప్పుడు యష్మీ ఇప్పుడు మరో లేడీ కంటెస్టెంట్ 


Similar News