మైనర్ పై జానీ మాస్టర్ అత్యాచారం.. సంచలన ఆరోపణలు చేసిన స్టార్ సింగర్.. నెట్టింట దుమారం రేపుతున్న ట్వీట్
తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న జానీ మాస్టర్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు.
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న జానీ మాస్టర్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ఈయన ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నారు. తనను జానీ మాస్టర్ లైంగికంగా వేధింపులకు గురిచేశాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదులో.. జానీ మాస్టర్ తనను కోరిక తీర్చాలని వేధించినట్లు, కోరిక తీర్చకపోతే ఆఫర్లు రాకుండా చేస్తానని, తనను పెళ్లి చేసుకోవాలని జానీ మాస్టర్ ఒత్తిడి చేసినట్లు పేర్కొంది. ప్రస్తుతం ఈ ఇష్యూ టాలీవుడ్లో దుమ్ము దుమారం రేపుతోంది. దీనిపై ఇప్పటికే తెలుగు ఫిలిం ఛాంబర్ అధికారికంగా స్పందించింది. అలాగే కొంతమంది సెలబ్రెటీలు సైతం దీనిపై స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా స్టార్ సింగర్ చిన్మయి స్పందించింది. అందులో భాగంగా పలు మీడియా కథానాలను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్ పెట్టింది.
ఆమె మాట్లాడుతూ.. "నివేదికల ప్రకారం జానీ మాస్టర్ ఆ అమ్మాయి మైనర్‌గా ఉన్నప్పటి నుంచే వేధించడం మొదలుపెట్టాడు. అత్యాచారం చేయడం ఒక ఎత్తైతే, మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడడం మరో పెద్ద నేరం. ఈ కేసులో పోరాడేందుకు ఆ అమ్మాయికి మరింత శక్తి చేకూరాలని నేను కోరుకుంటున్నాను" అంటూ చిన్మయి ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈమె చేసిన ట్వీట్ నెట్టింట దుమ్ము దుమారం రేపుతోంది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.
Jani Master basically started abusing this girl when she was a minor according to the report.I truly wish this girl all the strength to fight through this. https://t.co/OYp4VPD4IH
— Chinmayi Sripaada (@Chinmayi) September 16, 2024
(video link credits to chinmayi sipaada X account)
Read More..
Video: రోడ్డుపై డాన్స్‌తో నిరసన తెలిపిన టాలీవుడ్ హీరోయిన్.. కారణం తెలిస్తే శభాష్ అనాల్సిందే