Naga Chaitanya: నేను ఎంతో కనెక్ట్ అయ్యా.. కాబోయే భార్యపై నాగచైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్

అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), శోభిత ధూళిపాళ (Shobhita Dhulipala) ఈ ఏడాది ఆగస్టు 8న ఎంగేజ్మెంట్ (Engagement) చేసుకున్న సంగతి తెలిసిందే.

Update: 2024-11-24 14:17 GMT
Naga Chaitanya: నేను ఎంతో కనెక్ట్ అయ్యా.. కాబోయే భార్యపై నాగచైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్
  • whatsapp icon

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), శోభిత ధూళిపాళ (Shobhita Dhulipala)  ఈ ఏడాది ఆగస్టు 8న ఎంగేజ్మెంట్ (Engagement) చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక త్వరలో వీరిద్దరు పెళ్లితో ఒక్కటి అయ్యేందుకు రెడీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చైతన్య తన కాబోయే భార్య శోభితపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ (Interesting comments) చేశాడు.

‘మా పెళ్లిలో ఆర్భాటాలకు తావులేదు. చాలా సింపుల్ (simple) అండ్ సంప్రదాయబద్ధంగా మా పెళ్లి జరగనుంది. హైదరాబాద్ (Hyderabad)లోని అన్నపూర్ణ స్టూడియోస్ (Annapurna Studios) మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకం. అక్కడ అయితే తాతయ్య ఆశీస్సులు కూడా మాపై ఉంటాయి. అందుకే మా పెళ్లి అక్కడే చేయాలని ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నాయి. శోభితతో కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నా. తనకు నేను ఎంతో కనెక్ట్ అయ్యాను. తను నన్ను బాగా అర్థం చేసుకుంది. నా జీవితంలో ఏర్పడిన శూన్యాన్ని శోభిత పూడుస్తుందని నాకు నమ్మకం ఉంది’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా.. నాగచైతన్య ప్రజెంట్ ‘తండేల్’ (Tandel) చిత్రంతో బిజీగా ఉన్నాడు. సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీని చందు మొండేటి (Chandu Mondeti) దర్శకత్వం వహించగా.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Read More...

Samantha: నా మాజీ కోసం ఖరీదైన గిఫ్ట్స్ కొని డబ్బు వృధా చేశా.. సమంత షాకింగ్ కామెంట్స్ (వీడియో)

Tags:    

Similar News