Munnabhayya: ‘RC16’ సెట్స్‌లో మున్నాభ‌య్యా.. వైరల్‌గా ఫొటోలు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రజెంట్ ‘గేమ్ చేంజర్’ (Game changer) చిత్రంతో బిజీగా ఉన్నాడు.

Update: 2025-01-04 10:17 GMT

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రజెంట్ ‘గేమ్ చేంజర్’ (Game changer) చిత్రంతో బిజీగా ఉన్నాడు. స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) తెరకెక్కించిన ఈ చిత్రం భారీ అంచనాల మధ్య జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఇక ఈ మూవీ అనంతరం రామ్ చరణ్ ‘ఉప్పెన’ ఫేం డైరెక్టర్ బుచ్చిబాబు సానా(BuchiBabu Sana) తో జతకట్టిన విషయం తెలిసిందే. ‘RC16’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయింది. అంతే కాకుండా మైసూర్‌లో రామ్ చ‌ర‌ణ్‌పై కీల‌క‌మైన స‌న్నివేశాలు కూడా తెర‌కెక్కించారు మేక‌ర్స్.

ఇదిలా ఉంటే.. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తుండగా.. ‘మీర్జాపూర్‌’ వెబ్ సిరీస్‌లో మున్నాభాయ్య (Munnabhaya)గా న‌టించిన‌ స్టార్ నటుడు దివ్యేందు శర్మ (Divyendu Sharma) కీలక పాత్రలో న‌టిస్తున్నట్లు చిత్రబృందం ఇంత‌కుముందే ప్రక‌టించింది. అయితే.. తాజాగా ‘RC16’ షూటింగ్ సెట్స్‌లో మున్నాభాయ్య జాయిన్ అయిన‌ట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ.. షూటింగ్ సెట్స్‌లో దివ్యేందు శ‌ర్మతో బుచ్చిబాబు దిగిన ఫొటోల‌ను చిత్రబృందం తాజాగా పంచుకుంది. ఇందులో కమెడియ‌న్ న‌వీన్ కూడా ఉన్నాడు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైర‌ల్‌ అవుతున్నాయి.

Tags:    

Similar News