Sankranthiki vasthunnam: ఈ సినిమాతో నా కల నెరవేరింది.. మీనాక్షీ చౌదరి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Update: 2025-01-03 14:15 GMT

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ మీనాక్షీ చౌదరి (Meenakshi Chaudhary) ప్రజెంట్ నటిస్తున్న తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki vasthunnam). విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిల్ రావిపూడి (Anil Ravipudi) డైరెక్షన్‌లో తెరకెక్కున్న ఈ మూవీ సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 14న థియేటర్‌లలో సందడి చేయనుంది. దీంతో ప్రమోషన్స్‌ (Promotions)లో జోరు పెంచారు చిత్ర బృందం. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాక్షీ చౌదరి సినిమాకు సంబంధించిన పలు విశేషాలు పంచుకుంది.

‘‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా సంక్రాంతి రిలీజ్ కావడం చాలా సంతోషంగా ఉంది. ఈ జర్నీ ఒక డ్రీమ్‌ (Dream)లా ఉంది. కాప్ రోల్ చేయాలనే నా కల ఈ సినిమాతో తీరింది. వెంకటేష్‌తో వర్క్ చేయడం సూపర్ ఎక్స్‌పీరియన్స్ (Super experience). ఆయన వండర్‌ఫుల్ హ్యూమన్ (Wonderful Human). ఎప్పుడు ఆనందంగా ఉంటూ అందరిని నవ్విస్తూ ఉంటారు. ఈ సినిమా మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ (Family subject). మేజర్ పోర్షన్ కామెడీ ఉంటుంది. ఇది క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఎందుకంటే ఇందులో అన్నీ ఎమోషన్స్ ఉంటాయి. అందరికి తప్పకుండా నచ్చుకుంది. ఈ సంక్రాంతి నిజంగా మీకు పండుగ వాతావరణాన్ని ఇస్తుంది’ అని చెప్పుకొచ్చింది. అలాగే తన తదుపరి ప్రాజెక్ట్‌ల గురించి చెప్తూ.. ‘ప్రస్తుతం నవీన్ పొలిశెట్టితో ఓ సినిమా చేస్తున్నా. మరో రెండు మూడు సినిమాలు కూడా ఉన్నాయి. వాటిపై త్వరలోనే అనౌన్స్‌మెంట్ వస్తుంది’ అని తెలిపింది.

Tags:    

Similar News