Manoj: బ్లాక్ బస్టర్ వెబ్‌సిరీస్ సీక్వెల్‌కు సంబంధించి హీరో ఆసక్తికర పోస్ట్.. !
ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్(The Family Man) ఇప్పటికే రెండు పార్ట్స్‌గా ప్రజల ముందుకు వచ్చి.. సినీ ప్రేక్షకుల్ని అలరించిన విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్(The Family Man) ఇప్పటికే రెండు పార్ట్స్‌గా ప్రజల ముందుకు వచ్చి.. సినీ ప్రేక్షకుల్ని అలరించిన విషయం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్‌లకు రాజ్ అండ్ డీకే(Raj and DK) దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పేయీ(Manoj Bajpayee) ముఖ్య పాత్రలో కనిపించి.. జనాల్ని అలరించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో వేదిక(Amazon Prime Video platform)న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్(The Family Man) ఇప్పటికే రెండు పార్ట్స్‌గా ప్రజల ముందుకు వచ్చి.. సినీ ప్రేక్షకుల్ని అలరించిన విషయం తెలిసిందే.అందుకున్న ఈ వెబ్ సిరీస్‌కు సీక్వెల్‌గా మూడో పార్ట్ కూడా వస్తోన్న విషయం తెలిసిందే.
అయితే తాజాగా నటుడు మనోజ్ బాజ్‌పేయీ సోషల్ మీడియాలో ఈ చిత్ర షూటింగ్ గురించి ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. దీంతో సినీ లవర్స్ ఎగిరిగంతులేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో మనోజ్ రోల్‌కు సంబంధించిన చిత్రీకరణ కంప్లీట్ అయినట్లు సోషల్ మీడియా వేదికన పంచుకున్న పోస్ట్‌లో రాసుకొచ్చారు. అంతేకాకుండా సక్సెస్‌ఫుల్ గా మూడో పార్ట్ కూడా పూర్తయ్యిందని వెల్లడించారు. సరికొత్తగా ఈ ఫ్యామిలీ మ్యాన్ జనాల ముందుకు రాబోతున్నాడని తెలిపారు. ఇక ఈ వెబ్ సిరీస్‌లో షరీబ్ హష్మీ(Sharib Hashmi), ప్రియమణి(Priyamani), శ్రేయా ధన్వంతరీ(Shreya Dhanwantari), వేదాంత్ సిన్హా(Vedant Sinha) పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక మనోజ్ బాజ్‌పేయీ దేశభక్తుడైన గూఢచార పోలీసు ఆఫీసర్ శ్రీకాంత్ తివారీ(Intelligence Police Officer Shrikant Tiwari)గా నటిస్తున్నారు.