Anupama Parameswaran: దొంగిలించబడిన చొక్కాతో బతికేస్తున్నా.. హీరోయిన్ పోస్ట్ వైరల్
యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ‘అ..ఆ’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
దిశ, సినిమా: యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) ‘అ..ఆ’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత పలు సినిమాల్లో నటించిన ఈ అమ్మడు ‘శతమానం భవతి’ (Shatamanam Bhavati) సినిమాతో కుర్రాళ్లను ఆకట్టుకుంది. ప్రతి ఇంట్లో ఇలాంటి ఓ మరదలు ఉంటే బాగుండు అనే ఫీలింగ్ వచ్చేలా ప్రేక్షకుల్లో మంచి మార్కులు సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. ఇక అప్పటి నుంచి అనుపమ అందానికి, కూల్ లుక్‌కు ఫిదా అయిన యువత.. రీసెంట్‌గా వచ్చిన ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)లో ఆమె లుక్ చూసి షాక్ అయ్యారు.
ఇలాంటి సినిమాలు చేయకు అంటూ ప్రాధేయపడ్డారు. అయినా పట్టించుకోని ఈ అమ్మడు.. నటీగా ఎలాంటి రోల్ అయినా తను నటించనగలనని చెప్పుకొచ్చింది. ఇక ప్రజెంట్ ‘పరధా’ (Paradha)తో పాటు పలు మూవీస్‌తో బిజీగా ఉన్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్‌గా ఉంటూ రెచ్చిపోతుంది. తన హాట్ ఫొటో షూట్‌లతో, టెంప్టింగ్ పోజులకు కుర్రాళ్లను మెస్మరైజ్ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా లేటెస్ట్ ట్రెండీ వేర్‌లో దర్శనమిచ్చిన ఈ బ్యూటీ.. ‘ఆహ్ ఆహ్ ఆహ్ ఆహ్.. సాక్ ప్యాంట్ అండ్ దొంగిలించబడిన చొక్కాతో బతికేస్తున్న’ అనే క్యాప్షన్ ఇచ్చి కొన్ని ఫోటొలు షేర్ చేయగా.. ప్రజెంట్ అవి వైరల్ అవుతున్నాయి.