‘అవి సులభం అయినప్పుడు మనం పనులు చేయడం మానేస్తాం’: Malavika Mohan

టాలీవుడ్‌లో తక్కువ సినిమాల్లో కనిపించినప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు దక్కించుకుంది నటి మాళవిక మోహన్.

Update: 2025-03-18 07:00 GMT
‘అవి సులభం అయినప్పుడు మనం పనులు చేయడం మానేస్తాం’: Malavika Mohan
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో తక్కువ సినిమాల్లో కనిపించినప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు దక్కించుకుంది నటి మాళవిక మోహన్ (Malavika Mohan). తమిళ పరిశ్రమలో ఓ ఊపు ఊపిన ఈ అమ్మడు తన అందచందాలతో, నటన, డ్యాన్స్‌తో యూత్‌తో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. ఈ నటి తెలుగులో కోలీవుడ్ ప్రముఖ కథానాయకుడు ధనుష్ (Dhanush)సరసన మారన్ చిత్రంలో నటించి.. ప్రేక్షకుల్ని మెప్పించింది.

ఈ అమ్మడు నటనకు మంచి మార్కులే పడ్డప్పటికీ.. బాక్సాఫీసు వద్ద ఈ మూవీ అంతగా ఆడలేదు. తమిళంలో మాత్రం మాళవిక వరుస చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టిందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఈ బ్యూటీ రాజాసాబ్ సినిమాలో నటిస్తోందని సమాచారం. మూవీ విడుదల కాకముందే ఈ భామకు టాలీవుడ్‌లో మరింత క్రేజ్ పెరిగిపోతుంది. ఇక సినిమాల విషయం పక్కన పెడితే..

మాళవిక మోహన్ సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్‌గా ఉంటుంది. తన గ్లామర్ ఫొటోలు.. అలాగే తన వృత్తిపర విషయాలు ఎప్పటికప్పుడూ అభిమానులతో పంచుకుంటుంది. ఒక్కోసారి ఈ అమ్మడు గ్లామర్ ఫొటో షూట్లు కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తాయి. ట్రెండీ డ్రెస్సుల్లో అందాల విందు చేస్తూ నెటిజన్లను మాయ చేస్తుంటుంది.ఇకపోతే తాజాగా మాళవిక తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో మరో పోస్ట్ పెట్టింది.

ఇందులో తన అమ్మతో ఉన్న చిన్ననాటి మెమోరీస్‌ను పంచుకుంది. ఈ ఫొటోలకు ఓ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ‘‘ఒకప్పుడు నాన్న అమ్మ, మా ఇద్దరి ఫోటోలు చాలా అందంగా తీసేవారు. చాలా ఫోటోలు సినిమా ఫ్రేమ్‌ల లాగా కనిపిస్తాయి. నేను చాలా చిన్నదాన్ని.. అలాగే ఇలాంటి చిత్రాల చుట్టూ పెరిగాను కాబట్టి ఇవి ఎంత అరుదైనవి, విలువైనవో నాకు ఎప్పుడూ అర్థం కాలేదు. ప్రతి ఇంట్లో, ప్రతి కుటుంబంలో అందమైన సినిమా ఫోటోలు చాలా ఉన్నాయని నేను అనుకున్నాను.

చివరికి ప్రతిదీ డిజిటల్‌గా మారిపోయాయి. నాన్న మమ్మల్ని కూడా అదే విధంగా క్లిక్ చేయడం మానేశాడు. బహుశా ఫోటోలు క్లిక్ చేయడం చాలా సులభం అయి ఉండచ్చు. కానీ అవి చాలా సులభం అయినప్పుడు మనం పనులు చేయడం మానేస్తాం’’. అని రాసుకొచ్చింది. అలాగే ఈ చిత్రాలు ఈరోజు మా ఇంట్లో అత్యంత విలువైన వాటిలో కొన్ని అని.. ఈ రోజు అమ్మ పుట్టినరోజు కాబట్టి.. నాకు ఇష్టమైన వాటిలో కొన్నింటిని పంచుకోవాలనుకున్నాను. అత్యంత అందమైన మ్యూజ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు అని పేర్కొంది.

Full View

Tags:    

Similar News

Akanksha Puri