Oh Bhama Ayyo Rama: ‘ఓ భామ అయ్యో రామ’ టీజర్ డేట్ లాక్.. సంతోషం వ్యక్తం చేస్తోన్న సుహాస్ ఫ్యాన్స్
మరో అందమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు యువ కథానాయకుడు సుహాన్ (Suhan). ఈ హీరో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: మరో అందమైన ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు యువ కథానాయకుడు సుహాన్ (Suhan). ఈ హీరో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ప్రతీసారి ఏదో ఒక డిఫరెంట్ స్టోరీతో జనాల్ని మెప్పిస్తున్నాడు. ప్రస్తుతం సుహాస్ ఓ భామ అయ్యో రామ (Oh Bhama Ayyo Rama) అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ మూవీలో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చిత్రంలో మలయాళ హీరోయిన్ మాళవిక మనోజ్ (Malavika Manoj) హీరోయిన్‌గా నటిస్తోంది.
అంతేకాకుండా.. తెలుగులో ఈ అమ్మడు తొలి మూవీ అని చెప్పుకోవచ్చు. అలాగే రవీందర్ విజయ్ (Ravinder Vijay), అనితా హస్పానందని, బబ్లూ పృథ్వీ రాజ్ (Bablu Prithvi Raj),అలీ, మొయిన్ పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రామ్ గోధల తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ డైరెక్టర్‌కు కూడా ఇదే తొలి మూవీ. అలాగే హారీష్ నల్ల నిర్మాణ బాధ్యతలు వహించగా.. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా రిలీజ్ చేయనుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన పోస్టర్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది.
ఈ పోస్టర్‌లో మాళవిక మనోజ్ అండ్ సుహాస్ రొమాన్స్ జనాల్లో ఆసక్తిని పెంచింది. దీన్ని చూస్తుంటే.. ఈ కపుల్ అందించే లవ్ స్టోరీ భావోద్వేగాలను రేకెత్తించేలా ఉండబోతుందని స్పష్టంగా అర్థమవుతుందని అభిమానుల అంచనా. ఇకపోతే రాధన్ సంగీతాన్ని సమకూర్చుతోన్న ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. కాకపోతే ఈ ఏడాది సమ్మర్‌లోనే విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.
అయితే ఈ క్రమంలో ఓ భామ అయ్యో రామ మూవీ నుంచి మరో అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది. తాజాగా సుహాస్ అండ్ మాళవిక మనోజ్ సోషల్ మీడియా వేదికన ఓ పోస్ట్ పెట్టారు. ‘కొంచెం పిచ్చి, చాలా ప్రేమతో నిండిన మధురమైన దృశ్యాన్ని తీసుకువస్తున్నాను’ అని క్యాప్షన్ జోడించి.. మార్చి 24 వ తేదీన, ఉదయం 11. 07 గంటలకు టీజర్ విడుదల అవుతున్నట్లు పోస్టులో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త విన్న అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.