Megastar Chiranjeevi: ఫ్యాన్స్‌తో సరదాగా ముచ్చటించిన మెగాస్టార్.. అందరి ఇళ్లకు వెళ్లి.. ?

టాలీవుడ్ ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

Update: 2025-03-21 12:26 GMT
Megastar Chiranjeevi: ఫ్యాన్స్‌తో సరదాగా ముచ్చటించిన మెగాస్టార్.. అందరి ఇళ్లకు వెళ్లి.. ?
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ హీరో అనేక చిత్రాల్లో నటించి.. తనకంటూ గొప్ప గుర్తింపు దక్కించుకున్నాడు. చిరు మూవీలో ఏ మూలన అవకాశం వచ్చిన సరే ఓకే అని చెప్పే అభిమానులున్నారని చెప్పుకోవచ్చు. అంత డై హార్డ్ ఫ్యాన్స్‌ను మెగాస్టార్ సంపాదించుకున్నారు. కేవలం చిరునే కాకుండా.. తన ఫ్యామిలీలోని వారసుల్ని కూడా సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. వారు ప్రస్తుతం మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి జనాల మెప్పు పొందుతున్నారు.

ఇకపోతే చిరంజీవి ప్రెజెంట్ యూకే (UK)లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా అక్కడి ఫ్యాన్స్‌తో మెగాస్టార్ చిరంజీవి ముచ్చటించారు. వారందరితో సరదాగా కాసేపు మాట్లాడారు. వారందరినీ మెగాస్టార్ నా తమ్ముళ్లు, సోదరీమణులు అని అన్నారు. లైఫ్‌లో మీరు గొప్ప స్థాయికి వెళ్తే.. నాకు సంతోషమని తెలిపారు. జీవితంలో ఏదో ఒక టైంలో మూవీ వీక్షించి.. లేకపోతే ఏదో ఒక మాట విని మీరంతా స్పందించే ఉంటారని పేర్కొన్నారు.

అలాగే తనను స్ఫూర్తిగా తీసుకున్నవారేనని అన్నార. అందరి ప్రేమ, అభిమానాన్ని పొందుతున్నానని చిరు హ్యాపీ కామెంట్స్ చేశారు. ఇంతకంటే జీవితానికి ఏం కావాలని వెల్లడించారు.అంతేకాకుండా మెగాస్టార్ ప్రతి ఒక్కరి ఇళ్లలోకి వెళ్లి.. వారందరితో ప్రేమగా మాట్లాడాలని ఉందని వెల్లడించారు. అలాగే సోదరీమణులు వండిన వంటకాల్ని టేస్ట్ చేయాలని ఉందని తెలిపారు. ఆ చాన్స్ ఎప్పుడు వస్తుందో అన్నారు. ప్రస్తుతం మెగాస్టార్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News

Vaishnavi Chaitanya