మత్తెక్కిస్తోన్న కళ్లతో.. బ్లాక్ డ్రెస్‌లో కవ్విస్తోన్న పవర్‌స్టార్ హీరోయిన్..!
టాలీవుడ్ నటి ప్రణీత (Praneetha)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ నటి ప్రణీత (Praneetha)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. బావ (Bāva) సినిమాతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తర్వాత ఏకంగా అగ్ర హీరోల సరసన అవకాశాలు కొట్టేసింది. జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి రభస (Rabhasa) సినిమాలో నటించింది. తర్వాత పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Powerstar Pawan Kalyan) సరస అత్తారింటికి దారేది మూవీలో నటించి.. బాపు బొమ్మగా తెలుగు ప్రజల్ని కట్టిపడేసింది. తన అందం, నటన, అభినయం, బొంగరల్లాంటి కళ్లతో యువత గుండెల్ని కొల్లగొట్టిందనడంలో అతిశయోక్తిలేదు.
ఇక కెరీర్‌లో ఎదిగే సమయంలో ఈ బ్యూటీ వ్యాపారవేత్త అయిన నితిన్ రాజు(Nitin raju)ను పెళ్లి చేసుకుంది. ప్రణీత, నితిన్‌కు 2022 లో పండంటి ఆడబిడ్డ జన్మనిచ్చింది. కొద్ది రోజుల కిందట మగబిడ్డకు కూడా జన్మనిచ్చింది. అలాగే పిల్లలతో దిగిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంది. పిల్లలిద్దర్ని సంప్రదాయంగా రెడీ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవ్వగా.. ఫ్యాన్స్ క్యూట్ కామెంట్స్ పెడుతుంటారు.
ఇకపోతే తాజాగా ప్రణీత సుభాష్ సోషల్ మీడియా వేదికన ఓ పోస్ట్ పెట్టింది. ‘డార్లింగ్ సాధారణ దుస్తుల ప్రపంచంలో, నల్లటి దుస్తులు ధరించు’ అంటూ ఓ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ప్రణీత బ్లాక్ డ్రెస్‌లో ఇచ్చిన ఫొజులు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.