Samantha : నటి సమంతకు తీవ్ర అనారోగ్యం?

టాలీవుడ్(Tollywood) టాప్ హీరోయిన్ సమంత(Samantha) తీవ్ర అనారోగ్యానికి గురైందా? అవుననే తెలుస్తోంది.

Update: 2025-03-16 11:00 GMT

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్(Tollywood) టాప్ హీరోయిన్ సమంత(Samantha) తీవ్ర అనారోగ్యానికి గురైందా? అవుననే తెలుస్తోంది. తెలుగు, హిందీ, తమిళ్ వంటి పలు భాషల్లో టాప్ నటిగా దూసుకుపోతున్న నటి సమంత రూత్ ప్రభు(Samantha Ruth Prabhu)కు మళ్ళీ అనారోగ్య సమస్యలు తిరగబెట్టడంతో ఆమె ఆసుపత్రిలో చేరారు. తాజాగా సమంత ఆసుపత్రి బెడ్ పై సెలైన్ ఎక్కించుకుంటున్న ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ ఫోటోను సామ్ తన ఇన్స్టాగ్రామ్(Instagram) లో పోస్ట్ చేయగా.. కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయింది. ఈ ఫోటో చూసిన ఆమె అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆమె ఆరోగ్యం ఎలా ఉందంటూ ఆమె ఆఫీసుకు వందలమంది కాల్స్ చేస్తున్నారు.

కాగా ఈ ఫోటో తాను అనారోగ్యంగా ఉన్నపుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్న రోజుల్లో తీసుకున్నదని ఆ ఫోటో కింద క్యాప్షన్ చేర్చారు. అయితే సమంత గత కొంతకాలంగా మయోసైటిస్(Mayocyties) అనే ఆటోఇమ్యూన్ తో పోరాడుతోంది. ఆ జబ్బు కారణంగా ఒక ఏడాది పాటు సినిమాలు అన్నీ పక్కన పెట్టి చికిత్స తీసుకుంది. ఈ మధ్య కొద్దిగా కొలుకొని మళ్ళీ సినిమాల మీద దృష్టి పెట్టింది. జిమ్ లో కసరత్తులు చేస్తూ.. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ.. కెరీర్ మీద తిరిగి దృష్టి పెట్టింది. కాగా సామ్ ప్రస్తుతం "రక్త బ్రహ్మాండ్"(Rakth Brahmand) వెబ్ సిరీస్ లో నటిస్తోంది. 

Tags:    

Similar News