"నా ప్రపంచాన్ని ప్రేమ, నవ్వు అన్ని రకాల ఆనందాలతో అలంకరించుకుంటున్నాను".. రష్మీ ఇంట్రెస్టింగ్ పోస్ట్
జబర్దస్త్ షో యాంకర్ రష్మీ గౌతమ్(Rashmi Goutham) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ స్టార్టింగ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లో నటించిన ఈ భామ తర్వాత కాలంలో హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది.

దిశ, వెబ్‌డెస్క్: జబర్దస్త్ షో యాంకర్ రష్మీ గౌతమ్(Rashmi Goutham) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ స్టార్టింగ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లో నటించిన ఈ భామ తర్వాత కాలంలో హీరోయిన్ రేంజ్‌కి ఎదిగింది. అయితే ఆమె అనుకున్నంత ఫేమ్ తెచ్చుకోలేక పోయింది. దీంతో యాంకరింగ్ వైపు వచ్చేసింది. అలా జబర్దస్త్ షో(Jabardasth Show)తో ఫుల్ పాపులారిటీ సంపాదించింది. అక్కడ సుడిగాలి సుధీర్(Sudigali Sudheer)తో రీల్ లవర్‌గా నటించి మెప్పించింది.
వీరిద్దరి జోడీ చూస్తే నిజంగానే వీరు రియల్ లైఫ్‌లో కూడా లవర్స్ ఏమో అనుకున్నంత క్యూట్‌గా ఉండేవారు. కానీ సుడిగాలి సుధీర్ జబర్దస్త్ మానేసి ప్రస్తుతం సినిమాల్లో హీరోగా చేస్తున్నాడు. అప్పుడప్పుడు బుల్లితెర షోలకు అతిథిగా వస్తూ అలరిస్తూ ఉంటాడు. ప్రస్తుతం రష్మీ జబర్దస్త్‌తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ(Sridevi Drama Company) షోకు కూడా యాంకరింగ్ చేస్తుంది.
అలాగే నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ అందాల విందును వడ్డిస్తోంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా రష్మి తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో వైట్ కలర్ డ్రెస్, పింక్ కలర్ చున్నీ వేసుకుని ట్రెడిషనల్‌గా కనిపించింది. అయితే ఈరోజు హోలీ(Holi Festival) అన్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగానే ఈ భామ ఇలా రెడీ అయి.. ఆ ఫొటోలకు ‘"నా ప్రపంచాన్ని ప్రేమ, నవ్వు మరియు అన్ని రకాల ఆనందాలతో అలంకరించుకుంటున్నాను.. హోలీ శుభాకాంక్షలు" అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు తిరిగి హ్యాపీ హోలీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ బ్యూటీ పోస్ట్ పై మీరు ఓ లుక్ వేసేయండి.
Read More..
Nabha Natesh: హాట్.. హాట్..అందాలతో కుర్రాళ్లను కవ్విస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ.