Hero Nagarjuna: ఆ జిల్లాలో విస్తారంగా వర్షాలు.. వరదల్లో చిక్కుకున్న హీరో నాగార్జున

అనంతపురం (Ananthapur), శ్రీ సత్యసాయి (Sri Satya Sai District) జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

Update: 2024-10-22 07:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం (Ananthapur), శ్రీ సత్యసాయి (Sri Satya Sai District) జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా అనంతపురం జిల్లా (Ananthapuram District)లోని పండమేరు వాగు (Panmeri Canal) ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీరు పొంగిపొర్లుతుండటంతో పలు కాలనీలో ఇప్పటికే పూర్తిగా జలమయమయ్యాయి. కార్లు, బైక్‌లు సైతం వరద నీటిలో కొట్టుకుపోయాయి. అదేవిధంగా శ్రీ సత్యసాయి జిల్లాలో గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఊదరుగాలులు వీస్తూ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడుతున్నాయి. సోమవారం రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి జిల్లాల్లోని వాగులు, వంకలు పొంగుపొర్లుతున్నాయి. హైదరాబాద్- బెంగళూరు (Hyderabad - Bengaluru Highway)పై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

ఈ క్రమంలోనే సినీ నటుడు నాగార్జునకు (Hero Nagarjuna)కు వింత అనుభవం ఎదురైంది. మంగళవారం ఉదయం ఓ ప్రైవేటు జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ కార్యక్రమానికి ఆయన అనంతపురానికి పయనం అయ్యారు. అయితే, మార్గమధ్యలో పుట్టపర్తి ఎయిర్‌పోర్టు నుంచి వస్తున్న సమయంలో నాగార్జున వరద ప్రాంతంలో చిక్కకున్నట్లుగా తెలుస్తోంది. అయితే, అప్రమత్తమైన అనుచరులు ఆయనను అక్కడి నుంచి క్షేమంగా మరో రూట్‌లో అనంతపురంకు సేఫ్‌గా తరలించడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. దీంతో ఆయన ఫ్యాన్స్ కూడా ఊపిరి పీల్చుకున్నారు. 


Similar News