చిన్నారులు కూడా అలా పిలిచేవారు.. ఆ పేరు పోగొట్టుకోవడానికి చాలా కష్టపడ్డా: కృతి సనన్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ 2014లో ‘హీరోపంటి’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది.
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ 2014లో ‘హీరోపంటి’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. అయితే ఇందులో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించగా.. సబ్బీర్ ఖాన్ తెరకెక్కించారు. ఈ మూవీ విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఆ తర్వాత కృతి సనన్ పలు చిత్రాల్లో నటించి స్టార్ బ్యూటీగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఈ అమ్మడు తెలుగులోనూ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘నేనొక్కడినే-1’ సినిమాలో నటించి మెప్పించింది.
ఇటీవల ఈ అమ్మడు ‘తేరి మెయిన్ ఐసా ఉల్జా జియా’ అనే మూవీతో ప్రేక్షకులను అలరించింది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘నేను ఎన్ని పెద్ద ప్రాజెక్ట్‌లలో చేసినా ‘టైగర్ ష్రాఫ్ హీరోయిన్’ అని పిలిచేవారు. మనకు సినీ ఇండస్ట్రీలో పెద్దగా ఫేమ్ లేనప్పుడు ప్రేక్షకులు ఇలాంటి పేర్లు పెట్టేస్తారు. హీరోపంటి తర్వాత నేను నటించిన ‘బరేలీ కి బర్ఫీ’ దర్శకురాలు అశ్వనీ పిల్లలు కూడా కూడా నన్ను అదే పేరుతో పిలిచేవారు. ఆ పేరు పోవాలని రెట్టింపు కష్టపడ్డాను.
పరిశ్రమలోకి వచ్చాక ‘హీరోపంటి’ లాంటి గొప్ప సినిమాలో అవకాశం రావడానికి ఎంతో సమయం పట్టలేదు. దానికంటే ముందు ‘నేనొక్కడినే’ మూవీలో నటించాను. అయితే ‘హీరో పంటి’ లో కొత్త వాళ్లు కావాలని మేకర్స్ భావించారు. అప్పటికి నేను బాలీవుడ్లో నటించలేదు. అందుకే నన్ను ఎంపిక చేశారు. ఆ తర్వాత తెలుగు సినిమాలు చేసినప్పటికీ బాలీవుడ్ హీరోయిన్‌గానే గుర్తింపు వచ్చింది’’ అని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ కృతి సనన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.