నిలోఫర్ ఆస్పత్రిలో దివ్యాంగురాలైన లిఫ్ట్ ఆపరేటర్ పై దాడి.. కేసు నమోదు

నీలోఫర్ ఆస్పత్రి సిబ్బంది లిఫ్ట్ ఆపరేటర్ దివ్యాంగురాలు పై పేషెంట్ అటెండర్ దాడి చేసిన సంఘటనలో నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Update: 2024-11-24 18:14 GMT

దిశ, కార్వాన్: నీలోఫర్ ఆస్పత్రి సిబ్బంది లిఫ్ట్ ఆపరేటర్ దివ్యాంగురాలు పై పేషెంట్ అటెండర్ దాడి చేసిన సంఘటనలో నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నీలోఫర్ ఆస్పత్రిలో ఔట్సోర్సు ఉద్యోగి అనిత(దివ్యాంగురాలు) లిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేస్తుంది. శనివారం సాయంత్రం పేషంట్ అటెండర్ లిఫ్టులో రావద్దు అన్నందుకు లిఫ్ట్ ఆపరేటర్ అనిత పై దాడి చేసింది. వెంటనే స్థానిక నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో దివ్యాంగురాలు అనిత ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం ఆసుపత్రి సూపరింటెండెంట్ రవి కుమార్ ను ప్రశ్నించగా, దాడి జరిగిన సంఘటన విషయం వాస్తవమేనని తాము కూడా సిసి కెమెరా ఫుటేజీ‌లో చూసామని తెలిపారు.

అంతేకాకుండా ఆదివారం సాయంత్రం ఆస్పత్రి గేటు వద్ద సెక్యూరిటీ గార్డ్ ఇమ్రాన్ పై కూడా పేషంట్ అటెండర్స్ దాడి చేశారని సూపరింటెండెంట్ తెలిపారు. నిత్యం పేషంట్ల అటెండర్స్ సిబ్బందిపై దాడి చేస్తున్నారని, పేషంట్ల అటెండర్స్ సంయమనం పాటించాలని సూపరింటెండెంట్ కోరారు. ఈ రకంగా దాడులు చేస్తే వారిపై కేసులు కూడా నమోదు చేసేందుకు వెనుకాడమని సూపరింటెండెంట్ హెచ్చరించారు. కొందరు పనిగట్టుకుని ఆసుపత్రి వద్ద తమకు డాక్టర్లు తెలుసని పేషంట్ల వద్ద డబ్బులు తీసుకుని డాక్టర్ల వద్దకు నేరుగా తీసుకెళ్తున్నారని ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, ఫిర్యాదు కూడా వచ్చిందని సూపరింటెండెంట్ తెలిపారు.


Similar News