పత్రికలు, ఛానళ్లు ప్రజల పక్షాన నిలబడాలి : మధుసూదనాచారి
పత్రికలు, ఛానళ్లు ఏ రాజకీయ వర్గానికి కొమ్ముకాయకుండా ప్రజల పక్షాన నిలబడి వారి గొంతుకగా మారాలని శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అభిప్రాయపడ్డారు
దిశ, హిమాయత్ నగర్ : పత్రికలు, ఛానళ్లు ఏ రాజకీయ వర్గానికి కొమ్ముకాయకుండా ప్రజల పక్షాన నిలబడి వారి గొంతుకగా మారాలని శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అభిప్రాయపడ్డారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఓ ఛానల్ ఆరో వార్షికోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూదనాచారి మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమంలో కాచం సత్యనారాయణ అలుపెరగని పోరాటం చేశారన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. ఒక ఛానల్ ను నడపడం ఎంత కష్టమైనదో తనకు తెలుసునని తాను ఓ ఛానల్ నడిపానన్నారు. ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాం మాట్లాడుతూ… ప్రత్యేక రాష్ట్రం వస్తే సొంతంగా పరిపాలించుకోగలరా అనుకున్న వారు ఈనాడు మనలను చూసి ఆదర్శంగా తీసుకుంటున్నారు. మీడియా రంగంలో ఆంధ్రావారి పెత్తనం కొనసాగిన తరుణంలో తెలంగాణ వారి నుంచి పత్రికలు, ఛానళ్లు రావలసిన అవసరం కనిపించిందన్నారు. ఉద్యమం సమయంలో వచ్చిన పత్రికలు, ఛానళ్లు భావ వ్యాప్తికి ఎంతో ఉపయోగపడ్డాయన్నారు. మాట్లాడుతూ… జర్నలిజం అంటే వాస్తవమన్నారు. సోషల్ మీడియా ఎంత అభివృద్ధి చెందినా పత్రికలను తప్పక చదవాలన్నారు. అందుకోసం గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలన్నారు. న్యూస్ జనం పక్షాల నిలబడి వార్తలు అందిస్తున్నారన్నారు. అరుణోదయ విమలక్క, ఛానల్ చైర్మన్ డా. కాచం సత్యనారాయణ, ఆప్ తెలంగాణ కన్వీనర్ సుధాకర్, ఛానల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.