Unstoppable 4 Promo: తెలుగు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిన మీటింగ్.. అక్కడేం జరిగింది ?

ఏపీ రాజకీయాలను మార్చేసిన మీటింగ్ లో ఏం జరిగిందో అన్ స్టాపబుల్ వేదికపై చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. బాల చంద్రుల మధ్య జరిగిన ముచ్చట్ల ప్రోమో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.

Update: 2024-10-22 09:03 GMT

దిశ, వెబ్ డెస్క్: బాలా-చంద్రుల ముచ్చట్లను చూసేందుకు అటు బాలయ్య ఫ్యాన్స్.. ఇటు సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అక్టోబర్ 25వ తేదీ రాత్రి 8.30 గంటలకు ఆహా వేదికగా స్ట్రీమ్ ఇయ్యే అన్ స్టాపబుల్ 4 (Unstoppable Season 4) ఫస్ట్ ఎపిసోడ్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారంటే అతిశయోక్తి కాదు. బాబుకి, బాలయ్యకి ఉన్న క్రేజ్ అలాంటిది. తాజాగా ఈ ఎపిసోడ్ కు సంబంధించిన వీడియోను ఆహా (Aha) నిర్వాహకులు విడుదల చేశారు. ప్రోమోలో బాలయ్య - చంద్రయ్యల మధ్య జోకులు బాగానే పేలాయి. బాలకృష్ణ (Nandamuri Balakrishna) వేసే జోకులకు చంద్రబాబు ముఖంలో నవ్వులు పూశాయి.

దేశ రాజకీయ చరిత్రలో ఎరగని విజయాన్నందుకున్న చాణక్యుడు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అంటూ.. నారా చంద్రబాబు నాయుడికి ఆహ్వానం పలికారు బాలకృష్ణ. ఇక వేదికపైకి వచ్చిన చంద్రబాబు మీ చమత్కారం మీది.. మా సమయస్ఫూర్తి మాది అని పంచ్ వేశారు. గతేడాది చంద్రబాబు నాయుడు అరెస్ట్ (Chandrababu Arrest) విషయంపై బాలయ్య ప్రశ్నలు సంధించారు. అరెస్ట్ పై ముందే ఇన్ఫర్మేషన్ ఉందా? అని అడగ్గా.. తాను బస్సులో ఉండగా మిమ్మల్ని అరెస్ట్ చేశాం.. అని చెప్పారని.. మొదటిరాత్రి నరకం చూశానని చంద్రబాబు తెలిపారు. జైలులో తాను ఎదుర్కొన్న పరిస్థితుల్ని చెబుతుంటే.. ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకున్నారు. తొలిరాత్రి జైల్లో ఉన్నప్పుడు తనకు చావుగురించిన ఆలోచనలు వచ్చాయనడంతో అంతా షాకయ్యారు. 53 రోజుల పాటు తీవ్రంగా ఇబ్బంది పడినట్లు వివరించారు.

తెలుగు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసిన మీటింగ్.. జైల్లో చంద్రబాబు - పవన్ కల్యాణ్ (Chandrababu - Pawan Kalyan Meeting)ల మధ్య జరిగిన సమావేశం.. అసలు ఆ రోజు జైలు గోడల మధ్య ఏం జరిగింది అని బాలయ్య ప్రశ్నించారు. తామిద్దరం రెండే రెండు నిమిషాలు మాట్లాడుకున్నామని, రాష్ట్రంలో నూతన చరిత్ర రాయడానికి ఆ రెండు నిమిషాల్లో సమయస్ఫూర్తిగా నిర్ణయం తీసుకోవడం అనేది ఒక హిస్టారికల్ డెసిషన్ అన్నారు చంద్రబాబు.

ఇక ప్రోమో చివరిలో అంతా సరదాగా సాగిపోయింది. బాలయ్య ఎక్కడుంటే అక్కడ నవ్వులు పూస్తాయని పొగిడారు చంద్రబాబు. తన చెల్లెలితో చూసిన రొమాంటిక్ సినిమా ఏది ? అని అడగ్గా.. ఇలాంటి ప్రశ్నలతో ఇబ్బందుల్లోకి నెట్టొద్దని తెలివిగా బదులిచ్చారు బాబు. ధోనీ - విరాట్ కోహ్లీ (Dhoni - Virat Kohli)లో తన ఫేవరెట్ ప్లేయర్ విరాట్ అని తెలిపారు. ఇంట్లో ఆధిపత్యం భార్యదా, కోడలిదా అంటే.. ఇదే నాకు పెద్ద సమస్యగా మారిందనడంతో అక్కడున్న అందరూ ఫక్కున నవ్వారు. మాస్ హీరో - మాస్ లీడర్ (Mass Hero, Mass Leader) బోత్ ఆర్ నాట్ సేమ్ అని చంద్రబాబు చెప్పిన డైలాగ్ కిక్కిచ్చింది. ఎప్పటికైనా ప్రపంచంలోనే తెలుగుజాతి నంబర్ వన్ గా ఉండాలన్నదే తన ఆకాంక్ష.. మనసులో ఉన్న కోరికను బయటపెట్టారు చంద్రబాబు. ఇంకా ఏయే విషయాలపై ఎంత సుదీర్ఘంగా మాట్లాడారో తెలియాలంటే ఇంకా మూడ్రోజులు ఆగాల్సిందే మరి. 

Tags:    

Similar News