Vikrant Massey : భార్య కాళ్లు మొక్కిన యంగ్ హీరో.. వైరల్ అవుతున్న ఫోటోలు

ఉత్తరాధిలో కర్వా చౌత్ ఫెస్టివల్ ను ఘనంగా జరుపుకుంటారు

Update: 2024-10-22 08:54 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఉత్తరాధిలో కర్వా చౌత్ ఫెస్టివల్ ను ఘనంగా జరుపుకుంటారు. భర్త సంతోషం, మంచి ఆరోగ్యం కోసం కోసం ఈ పూజను చేస్తుంటారు. అయితే, చాలా మంది సెలెబ్రిటీస్ ఫోటోలను షేర్ చేశారు. తాజాగా, 12th ఫెయిల్ హీరో విక్రాంత్ మస్సే కూడా ఫోటోలని తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు. దీనిలో ఈ జంట ముద్దుగా ఉన్నారు.

విక్రాంత్ ( Vikrant Massey ) భార్య పేరు షీతల్. అందరిలాగే ఈమె కూడా విక్రాంత్ ముఖాన్ని జల్లెడలో చూసింది. ఆ తర్వాత తన భర్త కాళ్ళకి మొక్కి ఆశీర్వాదం తీసుకుంది. తన భర్త విక్రాంత్ కూడా భార్య కాళ్లు మొక్కాడు. ఈ ఫొటోలపైన రియాక్ట్ అయిన నెటిజన్స్ మీ జోడి సూపర్, ఎప్పుడూ ఇలాగే ఉండండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం, ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags:    

Similar News