Renu Desai: లవ్‌లో ఉన్నానంటూ గుడ్ న్యూస్ అనౌన్స్ చేసిన రేణు దేశాయ్.. వైరల్ అవుతున్న పోస్ట్
పవన్ కల్యాణ్(Pawan Kalyan), రేణు దేశాయ్(Renu Desai) ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు.
దిశ, సినిమా: పవన్ కల్యాణ్(Pawan Kalyan), రేణు దేశాయ్(Renu Desai) ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. కానీ వీరిద్దరి పెళ్లి బంధం మున్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. ఇక పిల్లల బాధ్యత మాత్రం రేణు దేశాయ్ చూసుకుంటుంది. పవన్ మూడో పెళ్లి చేసుకోగా.. రేణు దేశాయ్ మాత్రం గత కొద్ది కాలంగా సినిమాలకు దూరం అయింది. జంతువులకు సహాయం చేస్తూ.. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు పోస్టులు షేర్ చేస్తోంది.
అలాగే ఫాలోవర్స్‌ను విరాళాలు కూడా అడుగుతూ అనాధ పిల్లలకు సాయంగా ఉంటుంది. అయితే ఇటీవల ఓ వీడియో షేర్ చేసి తాను మళ్లీ సినిమాల్లోకి రాబోతున్నట్లు తెలిపింది. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ పోస్ట్ ద్వారా గుడ్ న్యూస్ అనౌన్స్ చేసింది. షూటింగ్ జరుగుతున్న వీడియో షేర్ చేస్తూ ‘‘నేను 16 సంవత్సరాల వయస్సులో ప్రేమలో పడ్డాను. ఇప్పటికీ ప్రేమలో ఉన్నాను’’ అని రాసుకొచ్చింది.
అలాగే ‘‘యమున కిషోర్(Yamuna Kishore) అద్భుతమైన దర్శకుడిగా ఉండి ఈ మొత్తం షూటింగ్ ప్రక్రియను సౌకర్యవంతంగా, సరదాగా చేసినందుకు ధన్యవాదాలు’’ అనే క్యాప్షన్ జత చేసింది. అయితే రేణు దేశాయ్ వంటల కార్యక్రమంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన షూటింగ్ పనులు పూర్తి చేసే పనిలో ఆమె ఫుల్ బిజీగా గడుపుతున్నట్లు అర్థమవుతోంది. ప్రజెంట్ రేణు దేశాయ్(Renu Desai) పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. అది చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. సినిమాల్లోకి కాకుండా బుల్లితెరకు ఎంట్రీ ఇస్తుందా ఏంటి? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.