Actress Sobhitha: శోభిత ఆత్మహత్య కేసులో ట్విస్ట్.. సూసైడ్ నోట్ లభ్యం

కన్నడ నటి శోభిత మృతి కేసు (Actress Sobhitha Death Case)లో పోలీసులకు కీలక ఆధారం లభ్యమైంది. పోలీసులకు ఆమె నివాసంలో సూసైడ్ నోట్ (Suicide Note)దొరికింది.

Update: 2024-12-02 06:57 GMT

దిశ, వెబ్ డెస్క్: కన్నడ నటి శోభిత మృతి కేసు (Actress Sobhitha Death Case)లో పోలీసులకు కీలక ఆధారం లభ్యమైంది. పోలీసులకు ఆమె నివాసంలో సూసైడ్ నోట్ (Suicide Note)దొరికింది. సూసైడ్ నోట్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. అది ఎవరిని ఉద్దేశించి రాసిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్ చేసుకోవాలంటే యూ కెన్ డూ ఇట్ అని ఆ లేఖలో రాసి ఉందని తెలుస్తోంది. కన్నడతో పాటు తెలుగులోనూ పలు సీరియల్స్ లో నటించిన శోభిత ఆత్మహత్య చేసుకోవడం రెండు ఇండస్ట్రీలోనూ విషాదాన్ని నింపింది. నవంబర్ 30న రాత్రి భర్త సుధీర్ తో కలిసి భోజనం చేసిన శోభిత.. తన బెడ్రూమ్ లోకి వెళ్లి నిద్రపోయింది. ఆదివారం ఉదయం పనిమనిషి వచ్చి డోర్ కొట్టగా ఆమె తీయలేదు. సుధీర్ డోర్ పగలగొట్టి లోపలికెళ్లి చూడగా ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది.

శోభిత మృతిపై పోలీసులు భర్త సుధీర్, నైబర్స్ ను విచారించారు. ఎవరితోనూ ఎలాంటి గొడవలు లేవని తేలడంతో.. కేసు చిక్కుముడి మరింత బలపడింది. అసలు ఏ కారణంగా శోభిత చనిపోయిందో తెలియక సతమతమవుతున్నారు. శోభిత ఆత్మహత్య చేసుకునే ముందు ఫోన్లో ఎవరెవరితో మాట్లాడిందో పోలీసులు ఆరా తీస్తున్నారు.

Tags:    

Similar News