Venkaiah Naidu: ‘ఈ మూవీని వీక్షించడం తెలుగువారి కర్తవ్యం’: మాజీ ఉపరాష్ట్రపతి

నిన్న (డిసెంబరు1)హైదరాబాదులో ‘ఘంటసాల ది గ్రేట్’(Ghantasala the Great) మూవీ రిలీజ్ తేదీ పోస్టర్‌ ఆవిష్కరణ ఈవెంట్‌ను చిత్రబృందం నిర్వహించింది.

Update: 2024-12-02 05:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: నిన్న (డిసెంబరు1)హైదరాబాదులో ‘ఘంటసాల ది గ్రేట్’(Ghantasala the Great) మూవీ రిలీజ్ తేదీ పోస్టర్‌ ఆవిష్కరణ ఈవెంట్‌ను చిత్రబృందం నిర్వహించింది. ఈ సినిమా తొలితరం తెలుగు సినీ మ్యూజిక్ డరెక్టర్(Music Director), గాయకుడు ఘంటసాల వెంకటేశ్వర రావు(Singer Ghantasala Venkateswara Rao) జీవితం ఆధారంగా తెరకెక్కుతుంది. ఇందులో కృష్ణ చైతన్య(Krishna Chaitanya) ఘంటసాల రోల్ లో నటిస్తున్నారు. ఈయన భార్యగా మృదుల(mrudhula) నటిస్తుంది. సీహెచ్ రామారావు(CH Rama Rao) దర్శకత్వం వహించగా.. సీహెచ్ ఫణి(CH Fani) నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ మూవీ వచ్చే ఏడాది (2025) ఫిబ్రవరి 14 వ తారీకున థియేటర్లలో సందడి చేయనుంది. పోస్టర్ ఆవిష్కరణకు విచ్చేసిన మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు(Former Vice President Venkaiah Naidu) ఈ సందర్భంగా మాట్లాడారు. ‘ ఘంటసాలను శతాబ్ది గాయకుడు అని అంటారు అని అన్నారు. ప్రజాగాయకుడిగా ఆయన ఓ స్ఫూర్తి అని.. ఈయన ఉన్నంత కాలం ఈయన సంగీతం జనాల హృదయాల్లో నిలిచిపోతుందని తెలిపారు. అలాగే ఘంటసాలకు సతీమణిగా నటించిన మృదులను అభినందించారు. వాణిజ్య హంగులతో కాకుండా సదుద్దేశంతో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను వీక్షించడం మన తెలుగు వారి కర్తవ్యం’ అని వెంకయ్యనాయుడు వెల్లడించారు.  

Tags:    

Similar News