తండ్రైన జబర్దస్త్ కమెడియన్.. బేబీ పై ఆశలు పెట్టుకోవద్దని అన్నారంటూ ఎమోషనల్.. వీడియో వైరల్

ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా ఇప్పటి వరకు చాలా మంది ఫేమస్ అయ్యారు.

Update: 2024-12-13 08:42 GMT

దిశ, సినిమా: ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా ఇప్పటి వరకు చాలా మంది ఫేమస్ అయ్యారు. అలా పాపులారిటీ సంపాదించిన వారిలో యాదమ్మ రాజు కూడా ఒకరు. ఇతను కెరీర్ స్టార్టింగ్‌లో ఈటీవీ విన్‌లో ప్రసారమయ్యే పటాస్ షోలో తన కామెడీతో మెప్పించాడు. ఆ తర్వాత జబర్దస్త్ షో లోకి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ కూడా తన కామెడీ టైమింగ్స్, పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు. ఇక ఇతని వ్యక్తిగత విషయానికి వస్తే.. స్టెల్లా అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే తాజాగా యాదమ్మ రాజు తండ్రయ్యాడు. అతని భార్య స్టెల్లా రాజ్ పండంటి మగ బిడ్డను ప్రసవించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎమోషనల్ వీడియో పెట్టారు యాదమ్మ రాజు దంపతులు. దీంతో పలువురు బుల్లితెర సెలబ్రిటీలు, సినీ అభిమానులు, నెటిజన్లు యాదమ్మ రాజు దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

అయితే చాలా మందిలాగే స్టెల్లాకు ప్రసవ సమయంలో పలు సమస్యలు తలెత్తాయట. అందుకే ఈ ప్రసవం అంత ఈజీగా జరగలేదంటూ వారు తమ అనుభవాలను యూట్యూబ్ వీడియోలో పంచుకున్నారు. ఇందులో స్టెల్లా మాట్లాడుతూ.. ‘ నార్మల్ చెకప్‌ కోసం ఆస్పత్రికి వెళ్తే ఉమ్మునీరు తగ్గిందన్నారు. త్వరగా ప్రసవం చేయాలన్నారు. దీంతో డాక్టర్ల సలహాతో ఒక ఇంజెక్షన్‌ తీసుకుని ఇంటికి వచ్చాను. ఆ తర్వాత ఇంకో డాక్టర్‌ను సంప్రదిస్తే ఇది చాలా ఎమర్జెన్సీ కేసు.. వెంటనే ఆస్పత్రిలో అడ్మిట్‌ అవ్వాలన్నారు. అప్పటికీ కూడా కడుపులో ఉన్న బిడ్డకు కూడా గ్యారెంటీ ఇవ్వలేమన్నారు. అప్పుడు యాదమ్మరాజును పట్టుకుని చాలా ఏడ్చాను. ఏం చేయాలో అర్థం కాక ఇంటికి వచ్చాం’

మాకు తెలిసిన వాళ్ల ద్వారా తర్వాత రోజు గాంధీ ఆస్పత్రికి వెళ్తే ఉమ్మునీరు ఎక్కించారు. ఆ తర్వాత మరో హాస్పిటల్‌కి వెళ్లాం. నా పరిస్థితి క్లిష్టంగా ఉందన్నారు. అక్కడ కూడా బేబీ గురించి ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దన్నారు. ఈ కారణంగానే సీమంతం ఫంక్షన్ కూడా క్యాన్సిల్ చేసుకున్నాం. డాక్టర్స్ చెప్పిన డెలివరీ డేట్ కంటే దాదాపు 20 రోజుల ముందే ప్రసవం జరిగింది. ప్రస్తుతం బేబీ ఆరోగ్యంగా ఉంది’ అని స్టెల్లా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Full View

Tags:    

Similar News