Deepika Rangaraju: పెళ్లి పీటలెక్కబోతున్న బ్రహ్మముడి హీరోయిన్.. వరుడు ఎవరంటే..?

మా టీవీలో ప్రసారమయ్యే ధారావాహికల్లో ‘బ్రహ్మముడి’ ఒకటి. ఈ సీరియల్‌‌ను తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు.

Update: 2024-12-15 02:56 GMT

దిశ, సినిమా: మా టీవీలో ప్రసారమయ్యే ధారావాహికల్లో ‘బ్రహ్మముడి’ ఒకటి. ఈ సీరియల్‌‌ను తెలుగు బుల్లి తెర ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. ఇందులో బిగ్ బాస్ ఫేమ్ మానస్, దీపిక రంగరాజు బార్యాభర్తలుగా నటిస్తున్నారు. అయితే దీపిక(సీరియల్ నేమ్ కావ్య)కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. వంటలక్క తర్వాత అంతగా గుర్తింపు తెచ్చుకున్నది ఈ అమ్మడు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే దీపిక మన తెలుగు అమ్మాయి కాకున్న బుల్లి తెర ఆడియన్స్ ఈమెను ఎంతగానో ఆదరిస్తున్నారు. అలా సీరియల్‌లో మంచి ఫేమ్ తెచ్చుకున్న ఈమె.. అప్పుడప్పుడు పలు షోలకు, ఈవెంట్లకు వచ్చి అక్కడ తన అల్లరి, కామెడీ, వచ్చి రాని తెలుగుతో కడుపుబ్బా నవ్విస్తుంది.

అయితే కొన్ని సార్లు డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో తలనొప్పి తెప్పించిన సందర్భాలు కూడా ఉన్నాయి అవి వేరే విషయమనుకోండి. ఈ క్రమంలో ఈ బ్యూటీకి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట షికారు చేస్తుంది. బ్రహ్మముడి కావ్య త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఓ సీరియల్ హీరోతో దీపిక పీకల్లోతు ప్రేమలో ఉందట. అంతేకాకుండా తన లవ్ మ్యాటర్‌ని తన ఇంట్లో వాళ్లకి కూడా చెప్పి ఒప్పించిందట. కానీ, ఈ భామ బాయ్ ఫ్రెండ్ ఎవరు అనే విషయం మాత్రం సీక్రెట్‌గానే ఉంది. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.

Tags:    

Similar News