Daku Maharaj: ఇక ప్రతి పార్టీలో దబిడి దిబిడే.. మాస్ స్టెప్పులతో ఆకట్టుకుంటున్న బాలయ్య, ఊర్వశీ

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘దబిడి దిబిడే’ (Dabidi Dibide) సాంగ్ రానే వచ్చింది.

Update: 2025-01-02 13:17 GMT

దిశ, సినిమా: నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘దబిడి దిబిడే’ (Dabidi Dibide) సాంగ్ రానే వచ్చింది. ఈ పాటను తమన్, వాగ్దేవి ఆలపించగా.. ఇందులో బాలకృష్ణ (Balakrishna)తో నటి ఊర్వశీ రౌతేలా (Urvashi Rautela) మాస్ స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అంతే కాకుండా.. ‘ఇక ప్రతి పార్టీలో దబిడి దిబిడే’ అని ‘దబిడి దిబిడి సాంగ్ కేవలం పాట కాదు, ఎమోషన్!’ అంటూ కామెంట్స్ పెడుతూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు ఫ్యాన్స్. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), డైరెక్టర్ బాబీ కొల్లి (Bobby Kolli) కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘డాకు మహారాజ్’ (Daku Maharaj). ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal), శ్రద్ధ శ్రీనాథ్ (Shraddha Srinath) హీరోయిన్లుగా నటిస్తుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఇందులో నుంచి ప్రతి అప్‌డేట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా.. హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య ఈ ఏడాది సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 12న ‘డాకు మహారాజ్’ చిత్రం థియేటర్స్‌లో విడుదల కానుంది.

Full View


Tags:    

Similar News